వాట్ నెక్ట్స్ – కొండా సురేఖ ఏం చేయ‌బోతున్నారు..!


ఒకే ఒక్క మాట ఏకంగా మంత్రిప‌ద‌విని దూరం చేసింది.
కొండా సుస్మిత సీఎం రేవంత్ రెడ్డి మీద చేసిన వ్యాఖ్య‌లు చివ‌ర‌కు త‌ల్లి మంత్రి ప‌ద‌వికి ఎస‌రు పెట్టాయి. ప‌ర‌కాల టికెట్ గురించి వ‌చ్చిన పంచాయ‌తీ ఏకంగా తెలంగాణ పాలిటిక్స్ ని షేక్ చేసింది. ప్రస్తుతం కొండా సురేఖ తదుపరి అడుగు తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.

సెప్టెంబర్ 3న రేవంత్ రెడ్డి ఆమెను కేబినెట్‌ నుంచి తొలగించారు. గవర్నర్ కూడా ఆ నిర్ణయానికి ఆమోదం తెలిపారు. అయితే సురేఖ ఎమ్మెల్యేగా కొనసాగుతానని, వెంటనే కాంగ్రెస్‌ను వీడే ఆలోచన లేదని తాజాగా స్పష్టం చేశారు. దీనితో ఆమె కాంగ్రెస్ ని వీడేందుకు ఆస‌క్తి చూపించ‌లేదు అనేది తెలుస్తోంది.

1.త‌న వెర్ష‌న్ విన‌కుండా త‌న‌ని మంత్రి ప‌ద‌వి నుంచి తీసివేయ‌డం పై ఆమె వివ‌ర‌ణ కోరుతున్నారు

2.ఇలా త‌న‌ని ప‌ద‌వి నుంచి తొల‌గించ‌డం పై, ఆమె అలాగే మౌనంగా కొన‌సాగితే రాజ‌కీయంగా వ‌చ్చే రోజుల్లో ఇబ్బంది అనే ఆలోచ‌న చేస్తున్నారు

3.ఇక ప‌ర‌కాల టికెట్ క‌చ్చితంగా త‌న కుమార్తెకు ఇచ్చే అవ‌కాశం ఉండ‌దు. కాబ‌ట్టి రాజ‌కీయంగా కుమార్తె నిర్ణ‌యం కూడా ఇక్క‌డ కీల‌కం కానుంది.

    4.మంత్రి పదవి లేకపోయినా ఎమ్మెల్యేగా కొనసాగుతూ తన రాజకీయ ప్రభావాన్ని నిలబెట్టుకునే అవకాశం ఉంది.

    5.అయితే మంత్రి ప‌ద‌వి పోయింది కాబ‌ట్టి ఆమె వెన‌క‌డుగ‌వేయ‌ర‌ని తెలుస్తోంది. రేవంత్‌తో రాజీ పడతారా? లేక కాంగ్రెస్‌లోనే ఉంటూ రేవంత్‌పై రాజకీయ యుద్ధం కొనసాగిస్తారా అనేది చూడాలి

    6.అయితే మిగిలిన వ‌ర్గాలు రేవంత్ వ‌ర్గం ఆమెకి స‌పోర్ట్ చేస్తాయా అనేది పెద్ద ప్ర‌శ్న‌

    7.ఐదుసార్లు ఎమ్మెల్యేగా ప‌నిచేశారు సురేఖ, అంతేకాదు పార్టీలు మారినా కేడ‌ర్ మాత్రం చెక్కుచెద‌ర‌లేదు. ఈ అవ‌కాశం ఏ రాజ‌కీయ పార్టీ అయినా ఉప‌యోగించుకుంటుందో చూడాలి.

    8.మ‌రో బీసీ నాయ‌కుడికి కాంగ్రెస్ కేబినెట్ లో చోటు క‌ల్పిస్తే, ఈ అంశం టార్గెట్ చేసే అవ‌కాశం ఉండ‌దు. అందుకే కేబినెట్ లో మ‌రో ఇద్ద‌రు బీసీల‌కు ఛాన్స్ రావ‌చ్చు.

    9.వెంట‌నే కొండా సురేఖ పార్టీ మార‌క‌పోవ‌చ్చు రానున్న రోజుల్లో కాంగ్రెస్ నేత‌లు ఏమైనా కౌంట‌ర్లు ఇస్తే మాత్రం ఆమె రాజ‌కీయ నిర్ణ‌యం మార‌వ‌చ్చు.

    Leave a Comment