విశాఖ జిల్లా రాజకీయాలు ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారాయి.. కీలకంగా చెప్పుకుంటే మాజీ మంత్రి అలాగే మాజీ ఎమ్మెల్యే భీమిలిలో కీలక నాయకుడు అవంతి శ్రీనివాస్ పొలిటికల్ ఫ్యూచర్ పై ఒక చర్చ జరుగుతుంది. ప్రత్యక్ష రాజకీయాలకు ఆయన దూరమయ్యి సుమారు రెండు సంవత్సరాలు అవుతోంది.. ఇప్పుడు ఆయన అడుగులు ఎటువైపు ఉండచ్చు అనేది పెద్ద చర్చ.. దాదాపు 20 ఏళ్లుగా రాజకీయాల్లో కొనసాగుతున్నారు కానీ ఇప్పటి వరకు ఇంత పొలిటికల్ గ్యాప్ ఎక్కడ కూడా ఏర్పడలేదు. మెగాస్టార్ చిరంజీవి ఏర్పాటు చేసిన ప్రజారాజ్యం నుంచి ఆయన పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు.
2009లోనే విశాఖ జిల్లాలోని భీమిలి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014కి టిడిపి నుంచి అనకాపల్లి ఎంపీగా గెలిచారు. ఐదేళ్లు హస్తినలో రాజకీయ చక్రం తిప్ప 2019 నాటికి మళ్ళీ జగన్ చెంతకు చేరారు. భీమిలి నుంచి రెండోసారి గెలిచారు. జగన్ క్యాబినెట్లో మంత్రి పదవి వచ్చింది. మూడేళ్లు మంత్రిగా పదవి చేశారు. 2024 ఎన్నికల్లో వైసిపి నుంచి పోటీ చేశారు. భీమిలి నుంచి గంటా శ్రీనివాసరావు గెలుపొందారు. అవంతి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత నుంచి రాజకీయ కష్టాలు మొదలయ్యాయి అనే చెప్పాలి. ఓటమి తర్వాత తొలి ఆరు నెలలు సైలెంట్ గా ఉన్నారు. వైసీపీ నుంచి బయటకు వచ్చేసారు. వ్యక్తిగత కారణాలతో బయటకు వచ్చేశాను అని చెప్పారు.
ప్రస్తుతం తన విద్యా సంస్థలు వ్యాపారాలు చూసుకుంటూ ఉన్నారు. ఏ రాజకీయ వేదికలపై కనిపించడం లేదు. అలాగే ఏ రాజకీయ పార్టీ నాయకులు వెంట ఆయన ఉండడం లేదు.. కేవలం వ్యాపారాలు మీదే దృష్టి పెట్టారు. ఇప్పుడు అవంతి శ్రీనివాస్ పొలిటికల్ స్టెప్ ఏంటి అనేది పొలిటికల్ కారిడార్ లో చర్చ జరుగుతుంది.
ఇప్పటి వరకూ వైసిపి భీమిలి ఇన్చార్జిగా మజ్జి శ్రీనివాస్ ఉన్నారు. ఇటీవల ఆయన టిడిపిలో చేరిపోయారు. సో ఇప్పుడు టిడిపి తరఫున కీలకంగా శ్రీను విజయనగరంలో కొనసాగుతున్నారు. అవంతి మరోసారి వైసీపీలోకి వచ్చే ఆస్కారం లేదు. బొత్స సత్యనారాయణ కుమార్తె బొత్స అనూషని భీమిలి ఇంచార్జ్ గా జగన్ నియమించారు. టీడీపీ తరపున గంటా ఉన్నారు అలాగే ఆయన కుమారుడు రవితేజ వచ్చే ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యేగా నిలబడవచ్చు అనే చర్చ సాగుతోంది, మరో పక్క వైసీపీలోకి అవకాశం లేదు.
ఇక రాజకీయంగా ఆయన జనసేన పార్టీలోకి వెళితే బాగుంటుంది అనే చర్చ సాగుతోంది.ఒకసారి మంత్రిగా చేశారు ఎంపీగా చేశారు అలాంటి సీనియర్ నాయకుడు రెండు దశాబ్దాల కెరీర్ ఉన్నటువంటి ఆయన పార్టీలోకి వస్తానంటే కచ్చితంగా జనసేన చేర్చుకుంటుంది పవన్ కళ్యాణ్ కి కూడా దగ్గరగా ఉండేటటువంటి వ్యక్తి. ప్రజారాజ్యంలో కూడా గతంలో పనిచేసినటువంటి వ్యక్తి. సో మొత్తానికి 2029 ఎన్నికల నాటికి కీలకంగా ఆయన కూడా మారే అవకాశం ఉంటుంది. పొత్తులో భాగంగా ఏ సీట్లు ఎవరికి వస్తాయో చెప్పలేని పరిస్థితి. 2029 నాటికి డిలిమిటేషన్ అయిపోతుంది కాబట్టి సెగ్మెంట్లు కూడా పెరుగుతాయి.. కొత్త సెగ్మెంట్లు వస్తాయి కాబట్టి ఎమ్మెల్యేగా నిలబడే వాళ్ళకి అనేకమైనటువంటి అవకాశాలు ఉంటాయి. ఒకవేళ జనసేన కాదంటే కమలం గూటికి కూడా ఆయన చేరే అవకాశం ఉంటుందనేది ఒక చర్చ నడుస్తుంది. సో చూడాలి అవంతి శ్రీనివాస్ పొలిటికల్ ఫ్యూచర్ ఏమిటి అనేది, జిల్లాలోనే కాదు రాష్ట్రవ్యాప్తంగా అవంతి ఏ పార్టీలోకి వెళ్తారనే చర్చ జోరుగా సాగుతోంది







