అనుకున్న స‌మయానికి ఎన్నిక‌లు జ‌రుగుతాయా..

ఏపీలో లోకల్ బాడీ ఎలక్షన్స్ అక్టోబర్ తొలివారంలో జరుగుతాయా ఇదే ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్నగా మారింది.. స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికల విషయంలో కోర్టు కేసులు ఇప్పుడు అడ్డుపడే పరిస్థితి ఉంటుంది అనే చర్చ కూడా ఇప్పుడు బాగా వినిపిస్తోంది. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలపై ఎన్నో అభ్యంతరాలతో హైకోర్టులో పలు కేసులు నమోదయ్యాయి. వీటిపై విచారణ అయితే పూర్తి చేసి హైకోర్టు తీర్పుని రిజ‌ర్వు చేసింది. ఎన్నికల విషయంలో ఎలాంటి నిర్ణయం వస్తుందనేది ఇప్పుడు ఉత్కంఠ‌ రేపుతోంది.

ప్రభుత్వం అనుకున్న స‌మ‌యానికి ఎన్నికలన నిర్వ‌హించాలి అని భావిస్తోంది. ఈ సమయంలో ఎన్నికలు వాయిదా పడతాయా లేదంటే కచ్చితంగా అనుకున్న టైం కు జరుగుతాయి అనేది మాత్రం ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతుంది. మ‌రో ప‌క్క బీసీ రిజ‌ర్వేష‌న్ అంశం కూడా ఇటు రాష్ట్ర వ్యాప్తంగా అంద‌రూ చ‌ర్చించుకుంటున్నారు.

స్థానిక సంస్థలైనటువంటి మున్సిపాలిటీలు పంచాయతీలు జడ్పీ పీఠాలు వటికి సంబంధించి ఒకేసారి ఎన్నికల నిర్వహించడం పై ప్రభుత్వం ఆలోచన‌చేస్తుంది. వీటికి ప్ర‌ధానంగా రెండు అడ్డంకులు కూడా ఉన్నాయి. బీసీ రిజర్వేషన్లు పెంచుతూ కూటమి ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు ఒకటైతే సర్ ప్రక్రియ ఇది అమల్లో ఉండగా పాత ఓటర్ల జాబితాతో ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం పూనుకోవడం దీనిపై అభ్యంతరాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

ఈ రెండు విషయాల్లో అసలు ఎన్నికలు అనుకున్న సమయానికి జరుగుతాయా లేదా అనేది ఇప్పుడు ఉత్కంఠ‌గా మారింది. బీసీలకు 34% రిజర్వేషన్స్ సర్ ప్రక్రియ పై రానున్న రోజుల్లో ఎటువంటి తీర్పు వ‌స్తుందో చూడాలి.

Leave a Comment