ఏపీలో స్ధానిక సంస్దల ఎన్నికల హడావిడి మొదలైంది, ముఖ్యంగా కూటమిలో మూడు పార్టీలు ఒక నిర్ణయానికి వచ్చి పోటికి సిద్దం అవ్వనున్నాయి, ముగ్గురు అధినేతలు ఎప్పుడు భేటీ అవుతారు అనేది ఒక చర్చ, ఈ సమయంలో విజయవాడ మేయర్ టికెట్ ఈసారి టీడీపీ ఇప్పటి వరకూ రేసులో వినిపిస్తే తాజాగా జనసేన కూడా ఈ రేస్ లోకి వచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయవాడ మేయర్ పదవిని జనసేన కోరుకుంటోంది.మేయర్ అభ్యర్థిగా పెనుగొండ సుబ్బారాయుడు పేరు తెరపైకి రావడం ఆసక్తికరంగా మారింది.
కూటమిలో మేయర్ పదవి ఏ పార్టీకి దక్కుతుందన్న అంశం ఇంకా స్పష్టతకు రాకపోయినా.. జనసేనకు అవకాశం వస్తే సుబ్బారాయుడు పేరును పరిశీలించే చాన్స్ ఉందన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. అయితే, తుది నిర్ణయం పార్టీ అధిష్ఠానం, కూటమి సమన్వయంపై ఆధారపడి ఉంటుంది.
పెనుగొండ సుబ్బారాయుడికి రాజకీయాల కంటే ముందే సుదీర్ఘమైన వృత్తి, సామాజిక సేవా నేపథ్యం ఉంది. ప్రముఖ చార్టర్డ్ అకౌంటెంట్‌గా నాలుగు దశాబ్దాలకు పైగా అనుభవం ఉంది. ఆయన అల్లుడు కూడా పవన్ కల్యాణ్ పేషీలో ఓఎస్డీగా పనిచేస్తున్నారు, ఆయన కృష్ణతేజ. ఇక సుబ్బారాయుడు జనసేన పార్టీలో ఏడాదిగా క్రియాశీలకంగా పనిచేస్తున్నారు.
ఆర్థిక, పన్నులు, కార్పొరేట్ పాలన, ఆర్థిక మార్కెట్లకు సంబంధించిన వ్యవహారాల్లో పనిచేశారు.
ఆర్యవైశ్య మహాసభలో కీలక బాధ్యతలు నిర్వహించిన ఆయన.. 2018 నుంచి 2020 వరకు రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ గౌరవ అధ్యక్షుడిగా వివిధ బాధ్యతలు చేపట్టారు. విజయవాడ క్లబ్ మాజీ కోశాధికారిగా కూడా సేవలందించారు.
2025 జూలై 10న జనసేనలో చేరారు. ఆ తర్వాత పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ.. పార్టీ నిర్మాణ సారథుల సమాచార సెంట్రల్ కమిటీలో సభ్యుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఐదుగురు సభ్యులతో కూడిన ఈ కమిటీలో ఆయన కూడా ఒకరుగా పార్టీకి సంబంధించిన సమాచార సేకరణ, క్రోడీకరణలో భాగస్వామిగా ఉన్నారు, ఓ పక్క టీడీపీ నుంచి ఇద్దరు ముగ్గురు పేర్లు వినిపిస్తుంటే మరో పక్క జనసేన నుంచి సుబ్బారాయుడి పేరు తెరపైకి రావడం జనసేన వర్గాల్లో కూడా నూతన ఉత్తేజం కలిగిస్తోంది







