ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల హడావిడి మొదలవ్వనుంది. డిసెంబర్ 15 లోపు ఈ ఎన్నికలన్నీ కూడా పూర్తవబోతున్నాయి. ఇప్పటికే ఎలక్షన్ కమీషన్ అన్ని ఏర్పాట్లు కూడా చేస్తోంది. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం రాజకీయంగా వేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టులో ఊహించని షాక్ తగిలింది. సర్ ప్రక్రియ పూర్తిగా ముగిసే వరకు లోకల్ బాడీ ఎలక్షన్స్ అలాగే వార్డుల పునర్విభజన ప్రక్రియ నిలిపివేయాలంటూ వైసీపీ సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. అక్కడ పిటిషన్లు కూడా దాఖలు చేసింది.
కానీ వాటిని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. గతంలో హైకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో దాన్నే సమర్థించింది ధర్మాసనం. సో ఎన్నికలు అడ్డుకోవాలని ప్రతిపక్ష పార్టీ వైసిపి ప్రయత్నాలు చేస్తుందంటూ టిడిపి విమర్శిస్తున్న వేళ తాజాగా సుప్రీంకోర్టులో కూడా ఊహించని షాక్ తగిలింది. ఇప్పుడు ఎన్నికలు ముందుకు వెళ్లే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.
ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ పూర్తి కావాలని అది పూర్తయిన తర్వాత వార్డుల విభజన చేయాలని అప్పటివరకు ఏపీలో లోకల్ బాడీ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వద్దంటూ కూడా వాదన చేశారు. కోర్టు వరకు కూడా వెళ్లారు వైసీపీ నేతలు. అయితే వాయిదా వేయడానికి ఇటువంటి కారణాలు సరిపోవని సుప్రీంకోర్టు ఏదైతే హైకోర్టు తీర్పు వచ్చిందో దాన్ని పూర్తిగా ఏకీభవించింది. హైకోర్టు ఇచ్చిన గ్రీన్ సిగ్నల్ తప్పు పట్టలేము అంటే న్యాయస్థానం నుంచి కూడా చుక్కెదురైంది.
దీంతో వైసిపి ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉందంటున్నారు టిడిపి నాయకులు. సుప్రీంకోర్టు కూడా తీర్పును సమర్ధించడంతో ఎన్నికల సంఘానికి ఎటువంటి అడ్డంకులు లేకుండా పోయాయి. లోకల్ బాడీ ఎలక్షన్స్ అనుకున్న సమయానికి పూర్తి చేయబోతున్నారు.సో మొత్తానికి ఇప్పుడు బీసీ రిజర్వేషన్ అంశం కూడా పెద్ద ఎత్తున చర్చకు కారణం అవుతుంది. ఈ సమయంలో తెలుగుదేశం పార్టీ మాత్రం తాము ఇచ్చినటువంటి రిజర్వేషన్ హామీ కచ్చితంగా తీరుస్తామని, ఈ విషయంలో ఎటువంటి భయాందోళన అక్కర్లేదని, బీసీలకు 34% రిజర్వేషన్లు కచ్చితంగా అమలు చేస్తాం ఇస్తామంటూ చెబుతున్నారు
స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించడం ఇప్పుడు కొత్త ఆసక్తి అయితే కనిపిస్తోంది. ఇక బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే అంశానికి టిడిపి కట్టిబడే ఉందని స్పష్టం చేస్తుంది టీడీపీ అధినాయకత్వం. గత ప్రభుత్వం చేసిన నష్టాన్ని పూడ్చేందుకే జీవో 105 జీవో 1065లను ప్రభుత్వం తీసుకొచ్చినప్పటికీ వీరు కోర్టుకు వెళ్లడంతోనే ఆలస్యమంటూ కామెంట్ చేస్తోంది.
సో మొత్తానికి తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి హామీ కచ్చితంగా ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ముందుకు రాబోతోంది. బీసీల రాజకీయ ఎదుగుదలకు ఎప్పుడు తాము అండగా ఉంటామంటూ చంద్రబాబు కూడా కీలక ప్రకటన చేశారు. సుమారు 40 ఏళ్లుగా అంటే నాలుగు దశాబ్దాలుగా ఎన్టీఆర్ హయాంలోని బీసీలకు అనేక పదవులు వచ్చాయని, ఇప్పటికి అదే కొనసాగిస్తున్నామన్నారు.
1995లోనే 34 శాతం రిజర్వేషన్లు టిడిపి ఆనాడు అమలు చేసిందని. ఇది ఇప్పుడు కూడా చేస్తామంటూ తెలియజేస్తుంది. ఇక 34% రిజర్వేషన్లని వైసిపి 24 శాతానికి తగ్గించిందని సో ఇప్పుడు 16,800 మంది బీసీలకు పదవులు కోల్పోయారని విమర్శించింది. హైకోర్టు రిజర్వేషన్లు కొట్టేస్తే పట్టించుకోని వైసిపి మళ్లీ కోర్టుకు వెళ్లడం ఏంటి అంటూ కూడా టిడిపి ఆగ్రహం వ్యక్తం చేస్తుంది.
మొత్తానికి బీసీలకు అత్యధికంగా ఎక్కువ స్థానాలు ఇప్పుడు రాబోతున్నాయి. అయితే మిగిలినవి ఎలా భర్తీ చేస్తారనేది ఒక పెద్ద చర్చగా మారింది. సుప్రీం కోర్టు తీర్పు తర్వాత మరి ఎలా రిజర్వేషన్లు 34 శాతం ఏపీ ప్రభుత్వం ఇస్తుంది అనేది మాత్రం సౌత్ లోనే కాదు దేశంలోనే అందరూ ఎదురుచూస్తున్నారు.
ఈసారి బీసీలకు మెజారిటీ అవకాశాలు రాబోతున్నాయి. 17 మేయర్ స్థానాలకు దాదాపు 34% బీసీలకు అవకాశం రాబోతోంది. ఒక ఐదు ఆరు స్థానాలు బీసీలకు అవకాశం వస్తాయి.. ఇందులో ఇద్దరు మహిళలు కూడా అవకాశం ఉంటుంది. అలాగే 28 జెడ్పీ చైర్మన్ల ఎన్నికలో కూడా 34% బీసీలకు అవకాశం ఉంటుంది. మొత్తంగా లోకల్ బాడీ ఎలక్షన్స్ లో బీసీల హవా ఈసారి స్పష్టంగా కనిపించబోతుంది. వైసిపి ఇప్పటికే నెల్లూరు నుంచి మేయర్ అభ్యర్థిగా జనరల్ అభ్యర్థిని ప్రకటించడం కూడా రాజకీయంగా ఆసక్తి రేపుతోంది.







