బాల‌య్య కుమారుడి సినిమా ప్ర‌క‌ట‌న వ‌చ్చేసింది..

నందమూరి నటసింహం బాలయ్య సినిమాలకు ఎంత‌టి క్రేజ్ ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఆయ‌న రేంజ్ అలాంటిది. ఇటీవ‌ల వ‌రుస‌గా నాలుగైదు ప్రాజెక్టులు ఒకే చేస్తున్నారు బాల‌య్య‌. తాజాగా ఆయ‌న ఫ్యాన్స్ మాత్రం ఎప్ప‌టి నుంచో కోరుకుంటోంది ఆయ‌న వార‌సుడి ఎంట్రీ గురించి. ఎందుకంటే ఆయ‌నతో ఎంట్రీ ఇచ్చిన హీరోల‌ వార‌సులు అంద‌రూ, త‌మ పిల్ల‌ల చేత సినిమా ఇండ‌స్ట్రీలో ఎంట్రీ ఇప్పించారు. ఇక బాల‌య్య మాత్రం త‌న కుమారుడి చేత ఎంట్రీ ఇప్పించ‌లేదు.

అందుకే బాల‌య్య బాబు కుమారుడు ఎప్పుడు ఎంట్రీ ఇస్తారా అని నంద‌మూరి అభిమానులు వేయి క‌ళ్ల‌తో చూస్తున్నారు. గ‌తంలో బాల‌య్య ఆయ‌న కుమారుడిని లాంచ్ చేస్తారని, అలాగే ఆయ‌న డైరెక్ష‌న్ చేస్తారు అని వార్త‌లు వినిపించాయి. కానీ ఆయ‌న ఆ బాధ్య‌త‌లు చేయ‌డం లేదు. తాజాగా దీనిపై ఓ క్లారిటీ వ‌చ్చింది.

NBK 111 మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో వస్తున్న భారీ యాక్షన్ చిత్రానికి దాదా DADA అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ నేమ్ ట్రీట్ తో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఇక మోక్షజ్ఞ పుట్టిన రోజు కావ‌డంతో నేమ్ రీవీల్ చేశారు. ఇదే స‌మ‌యంలో మోక్షజ్ఞ చిత్రం పై కూడా సాలిడ్ అప్ డేట్ వ‌దిలారు.

నందమూరి హీరోతోనే సాలిడ్ డెబ్యూ ఇచ్చిన దర్శకుడు వశిష్ఠతో మోక్షజ్ఞ ఇప్పుడు సినిమా చేయ‌నున్నారు.

ఇక ఈ సినిమాకి కూడా ప్ర‌ముఖ టాలీవుడ్ చిత్ర నిర్మాణ సంస్ధ మైత్రీ బాధ్య‌త‌లు తీసుకుంది. ఇక మోక్షజ్ఞ ని వశిష్ఠ ఎలా చూపిస్తారా అని అంద‌రూ ఎదురుచూస్తున్నారు. హై లెవ‌ల్ బ‌డ్జెట్ తో ఇప్పుడు మోక్షు సినిమా ఉండ‌నుంద‌ట‌. డైరెక్ట‌ర్ వశిష్ఠ గ‌తంలో బింబిసార సినిమాతో ఓ చ‌రిత్ర క్రియేట్ చేశారు. ఇప్పుడు నంద‌మూరి కుటుంబంలో మ‌రో వారసుడిని తీసుకురానున్నారు .

ఇక మోక్షు కోసం చాలా మంది ఇప్ప‌టికే బాల‌య్య‌కు క‌ధ‌లు వినిపించారు కాని, కొన్ని క‌ధ‌లు ఆయ‌న‌కు న‌చ్చ‌లేదు తాజాగా ఈ క‌థ‌ని ఒకే చేసిన‌ట్లు తెలుస్తోంది.

Leave a Comment