9 జెడ్పీ స్ధానాల‌పై జ‌న‌సేన గురి..

ఏపీ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో జనసేన మెజారిటీ స్థానాల్లో పోటీ చేయడానికి సిద్ధమవుతోంది. తాము ఎక్కడెక్కడ బలంగా ఉన్నామనే స్థానాలని ఇప్పటికే జనసేన పూర్తిగా ఫోకస్ పెట్టింది. సుమారు 123 లోకల్ బాడీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. మున్సిపాలిటీలు అదేవిధంగా కార్పొరేషన్లు నగర పంచాయతీలకు సంబంధించి ఎన్నికలు జరగబోతున్నాయి. మేయర్ మున్సిపల్ పీఠాలపై అదే విధంగా జెడ్ పీ పీఠాలపై కూడా పూర్తి ఫోకస్ పెట్టింది జనసేన.

ప‌వ‌న్ క‌ల్యాణ్ పార్టీ జ‌న‌సేన‌ తొమ్మిది జడ్పీ స్ధానాల‌పై ఫోకస్ చేసినట్టు వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఒకసారి చూస్తే ముందుగా పోలవరం ఇక్కడ పూర్తిగా ఫోకస్ చేసింది. అలాగే మార్కాపురం, శ్రీకాకుళం, పల్నాడు, తిరుపతి, కాకినాడ, బాపట్ల, ఈస్ట్ గోదావరి, పార్వతిపురం మన్యం. ఈ తొమ్మిది స్థానాలపై జనసేన పూర్తిగా ఫోకస్ చేసింది. ఇక్క‌డ నుంచి జనసేన అభ్యర్థులు రెడీ అవుతున్నారు పోటీ చేయడానికి.

కీలకంగా చూసుకున్నట్లయితే ఇప్పటికే సుమారు 30 మున్సిపల్ పీఠాలు కావాలని జనసేన కొరుతోంది. మరోపక్క సుమారు ఐదు నుంచి ఆరు మేయర్ స్థానాలు అంటే కార్పొరేషన్ స్థానాలు కావాలని కోరుతుంది. మరి 3 పార్టీలకు సంబంధించి ఉమ్మడి కార్యాచరణ ఏ విధంగా ఉండబోతోంది, జనసేన బలంగా ఉన్న స్థానాలను వదిలిపోవడానికి సిద్ధంగా లేదు. ఇటువంటి పరిస్థితుల్లో జనసేన ఎక్కడెక్కడ నిలబడుతుందని ఆసక్తి జన సైనికులకి పార్టీ కార్యకర్తలకు కూడా స్పష్టంగా కనిపిస్తోంది.

ఈసారి ఎట్టి పరిస్థితుల్లో తక్కువ స్థానాలు కాదు, మనం బలంగా ఉన్న అన్ని చోట్ల పోటీ చేద్దామంటూ పవన్ ఇప్పటికే పిలుపునిచ్చారు. వీర మహిళలకు కూడా అవకాశం ఇవ్వబోతున్నారు. జెన్ జీ తరానికి యువతకి మహిళలకు జనసేన పెద్దపీట వేయ‌బోతోంది. ఇటువంటి సమయంలో యువత కూడా ఈసారి లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఎక్కువగా జనసేన నుంచి పోటీ చేయాలని ఆసక్తి చూపిస్తున్నారు. సో ఇన్ని పేర్లు అయితే వినిపిస్తున్నాయి. ఉమ్మడిగా మూడు పార్టీలు అధినేతలు కూర్చుని ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో రాబోయే రోజుల్లో తేలనుంది.

Leave a Comment