విజయవాడలో మేయర్ టికెట్ కోసం కూటమిలో పెద్ద ఎత్తున కుమ్మలాట జరుగుతోంది. ఓ పక్క తెలుగుదేశం పార్టీ నుంచి విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు కుమారుడు సిద్ధార్థ్ పోటీలో ఉంటే, మరోపక్క తెలుగుదేశం పార్టీలో స్వచ్ఛంద్రా కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి రేసులో ఉన్నారు. మరోపక్క ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ భార్య గద్దె అనురాధా పేరు ఈ రేసులో వినిపిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీలోనే సుమారు ఐదుగురు ఆరుగురు పేర్లు తెరమీద వినిపిస్తున్నాయి. మరోపక్క జనసేన నుంచి కూడా ఇద్దరి పేర్లు వినిపిస్తున్నాయి. ఇక వంగవీటి కుటుంబం నుంచి ఆశాకిరణ్ కూడా జనసేనలో చేరి ఆమె మేయర్ రేసులోకి రావొచ్చు అంటూ ఒక వార్త వినిపిస్తోంది.
వంగవీటి రాధా కి కూడా గతంలో చంద్రబాబు ఎమ్మెల్సీ అవకాశం ఇస్తానన్నారు. ఒకవేళ ఎమ్మెల్సీ అవకాశం ఇవ్వలేదు కాబట్టి ఆయనకి కూడా మేయర్ టికెట్ ఇచ్చే అవకాశం ఉంది. కానీ ఆయన పోటీకి అంత ఇష్టం చూపించరని వార్తలు వినిపిస్తున్నాయి. మరోపక్క వైసీపీ నుంచి కూడా లిస్టు పెరుగుతుంది. వైసీపీ నుంచి చూసుకుంటే వైయస్ జగన్మోహన్ రెడ్డి కీలకంగా పార్టీ కోసం పనిచేసినటువంటి నాయకులకి మేయర్ టికెట్ ఇవ్వాలని భావిస్తున్నారు.
ముఖ్యంగా బీసీ వర్గాలకు టికెట్ ఇవ్వాలని ఆలోచనలో వైసిపి ఉంది. జగన్ కూడా ఇప్పటికే పార్టీ సీనియర్ల తో మాట్లాడుతున్నారు. ఒకవేళ కుదిరితే సీనియర్ గా ఉన్నటువంటి మల్లాది విష్ణుకు కూడా మేయర్ టికెట్ రావచ్చు అనే చర్చ జరుగుతోంది. అయితే ఇక్కడ టికెట్ విషయంలో చూస్తే కాపులు కమ్మ ఎక్కువగా టికెట్ ఆశిస్తున్నారు. ఇటు వైసీపీ గానీ అటు టిడిపి కానీ బీసీలకు అవకాశం ఇస్తే బాగుంటుందని ఆలోచన చేస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కీలకంగా ఉన్నటువంటి సెగ్మెంట్ విజయవాడ, ఇక్కడ మేయర్ అంటే క్యాబినెట్ స్థాయి పదవి అందుకే ఈ పదవి కోసం ఆశావహుల లిస్టు రోజు రోజుకి పెరుగుతుంది.







