క‌ర్నూల్ మేయ‌ర్ రేసులో ఎవ‌రు ఉన్నారంటే ?

ఈసారి లోక‌ల్ బాడీ ఎన్నిక‌లు చాలా ర‌స‌వ‌త్త‌రంగా సాగ‌నున్నాయి. కూట‌మి నుంచి ఆశావ‌హులు చాలా మంది ఉన్నారు. లోక‌ల్ బాడీ ఎన్నిక‌ల్లో ముఖ్యంగా క‌ర్నూలు మేయ‌ర్ 2021లో వైసీపీ కైవ‌సం చేసుకుంది. ఈసారి ఎవ‌రికి అవ‌కాశం రానుంది అనేది ఓచ‌ర్చ‌. ఈసారి లిస్ట్ లో కూట‌మి నుంచి వైసీపీ నుంచి చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి వారు ఎవ‌రు అనేది ఈ లిస్ట్ చూద్దాం

గ‌తంలో 2021లో వైసీపీ త‌ర‌పున బీవై రామ‌య్య మేయ‌ర్ గా వైసీపీ అవకాశం క‌ల్పించింది, ఇక డిప్యూటీ మేయ‌ర్ గా
ఎస్సీ రెడ్డి వ‌ర్గాల‌కు అవ‌కాశం క‌ల్పించారు, క‌ర్నూలు కార్పొరేష‌న్ జ‌నాభా నాలుగు ల‌క్ష‌ల 70 వేలు ఉన్నారు.
52 నుంచి 68 వార్డులు ఉన్నాయి. క‌ర్నూల్ , పాణ్యం ,కొడుమూరు ఈ మూడు సెగ్మెంట్లు కీల‌కం.

1.టీడీపీ త‌ర‌పున నాగ‌రాజు యాద‌వ్ ప‌ట్ట‌ణ అధ్య‌క్షుడిగా ఆయ‌న పేరు వినిపిస్తుంది. గ‌తంలో ఆయ‌న ప‌ట్ట‌ణ అధ్య‌క్షుడిగా ప‌నిచేసిన అనుభ‌వం ఆయ‌న‌కు ఉంది అలాగే జిల్లా బాధ్య‌త‌లు చూసుకున్నారు.

2.కురువ ప‌ర‌మేష్ కార్పొరేట‌ర్ గా చేశారు ఆయ‌న పేరు తెర‌మీద‌కు వ‌స్తుంది.

3.పాణ్యం నుంచి జ‌న‌ర‌ల్ పురుషోత్తం రెడ్డి పేరు వినిపిస్తుంది– మాజీ మార్కెట్ యార్డ్ చైర్మ‌న్

4.మైనార్టీ నుంచి అబ్బాస్ పేరు ప‌రిశీల‌న‌కు వినిపిస్తోంది.

6.మాజీ కార్పొరేటర్‌ కైప పద్మలతారెడ్డి టీడీపీ ప్ర‌ధాన కార్య‌దర్శిగా ఉన్న ఆమె పేరు వినిపిస్తుంది

7.సోమిశెట్టి వెంక‌టేశ్వ‌ర్లు పెద్ద కుమారుడు న‌వీన్ కుడా చైర్మ‌న్ రేస్ లో ఉన్నారు, తెలుగు యువ‌త‌లో బాగా యాక్టీవ్ గా న‌వీన్ ప‌నిచేశారు.

  1. సీనియ‌ర్ నాయ‌కుడు ( లేటు ) రామ‌కృష్ణ ఆయ‌న‌ ఇద్ద‌రు కుమారుల పేర్లు వినిపిస్తున్నాయి. కార్పొరేష‌న్ లో కుమార్తె మెంబ‌ర్ గా ఉన్నారు

** వైసీపీ త‌ర‌పున **

ఎస్వీ మోహ‌న్ రెడ్డి, కాట‌సాని రాం భూపాల్ రెడ్డి క‌స‌ర‌త్తు చేస్తున్నారు.

  1. మ‌హిళా కోటాలో గాజుల శ్వేతారెడ్డి మాజీ కార్పొరేట‌ర్ ఆమె పేరు వినిపిస్తుంది.
  2. సిద్దారెడ్డి రేణుక మాజీ డిప్యూటీ మేయ‌ర్ ఆమె పేరు వినిపిస్తుంది.

3.క‌ళ్లా న‌ర‌సింహారెడ్డి భార్య పేరు తెర‌మీద‌కు వ‌స్తుంది

4.మైనార్టీ స‌య్య‌ద్ ఆసీఫ్ హుస్సేన్ పేరు తెర‌మీద‌కు వ‌స్తుంది లేదంటే
మ‌హిళా కోటాలో శార‌ధా పేరు వినిపిస్తుంది.

5.బీసీకి అయితే వైసీపీ న‌గ‌ర అధ్య‌క్షురాలు స‌త్య‌నారాయ‌ణ‌మ్మ పేరు వినిపిస్తుంది.

Leave a Comment