టాలీవుడ్ ఇండస్ట్రీలో నరసింహారాజు అంటే తెలియని వారే ఉండరు. 1970- 80లో కథానాయకుడిగా అద్భుతమైన నటన చూపించారు. పౌరాణిక పాత్రలో ఆయన చేసిన నటన అమోఘం. ఆయన నటించినటువంటి సినిమాల్లో తూర్పు పడమర జగన్మోహిని ఎప్పటికీ ఎవరూ మర్చిపోలేని సినిమాలు . జగన్మోహిని ఎవర్ గ్రీన్ సినిమాగా నిలిచింది. ఆ తర్వాత క్యారక్టర్ ఆర్టిస్ట్ గా కూడా అనేక సినిమాలు చేశారు. అయితే రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అనేక విషయాల గురించి ప్రస్తావించారు.
మొదటినుంచి నేను ఎవరితో కూడా అంత కలిసి ఉండేవాడిని కాదు, |షూటింగ్ నా పని ఇలా ఉండేవాడిని. సాయంత్రం పార్టీలు వాటికి తిరిగేవాడిని కాదు. నా పని నేను చేసుకుని వెళ్ళేవాన్ని, ఎవరితో టచ్ లో ఉండేవాన్ని కాదు. నాకదే మైనస్ అయింది. తర్వాత విషయం నాకు అర్థమైంది. అందరితో కలిసి ఉంటే బాగుండేది అనిపించింది. ఒకప్పటితో పోల్చుకుంటే ఈ మధ్యన చాలా మార్పు వచ్చింది. అందరితో కాల్ చేసి మాట్లాడుతూ ఉన్నాను.
అప్పట్లో ఇలా ఉండి ఉంటే ఇంకా పెద్ద అవకాశాలు వచ్చేవి. ఆనాటి కొత్త తరం దర్శకులతో నిర్మాతలతో ఆదశలో ఉండి ఉంటే, ఎన్నో అవకాశాలు వచ్చేవేమో. అప్పట్లో చాలా మంది పెద్ద దర్శకులతో నేను వర్క్ చేసాను. ఆ దర్శకుల దగ్గర పని చేసిన వాళ్ళు తర్వాత కాలంలో మరింత పెద్ద దర్శకులయ్యారు. ఆ తరంలో వచ్చిన రవి రాజా పినిశెట్టి, రేలంగి, కోడి రామకృష్ణ వాళ్ళ సినిమాల్లో నేను నటించలేకపోయాను.
నేను టచ్ లో లేకపోవడమే దానికి కారణం. వారందరితో టచ్ లో ఉండి ఉంటే అప్పటి సినిమాల్లో కూడా నటించేవాడ్ని. మా అబ్బాయికి సినిమాల్లో చేయాలి అని ఆసక్తి ఉండేది. కానీ నాకు ఇష్టం లేదు. ప్రస్తుతం అతను కెనడాలో సెటిలైపోయాడు.ఇలా తన గురించి అనేక విషయాలు తెలియ చేశారు నరసింహరాజు.







