చిన్న శ్రీనుకి జిల్లా బాధ్య‌త‌లు ?

విజయనగరం జిల్లా రాజకీయాలు పూర్తిగా మారిపోతున్నాయి.. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల హడావిడి ఇప్పటికే మొదలైపోయింది. దాదాపు అక్టోబర్ రెండో వారంలో మున్సిపల్ అదే విధంగా కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ కూడా రానుంది. ఈ సమయంలో కీలకంగా విజయనగరం జిల్లా రాజకీయాలు మారుతున్నాయి. ఇటీవల వైసిపి నుంచి తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు మజ్జి శీను. బొత్స‌ సత్యనారాయణ మేనల్లుడుగా రాజకీయంగా ఆయనకు జిల్లాలో ఎంత గుర్తింపు ఉందో తెలిసిందే. విజయనగరం రాజకీయాలు ఇప్పుడు తెలుగుదేశం వైపు రాజ‌కీయంగా ఏం జ‌రుగుతుందా అని ఆలోచిస్తున్నారు.

చిన్న శ్రీను స్థానిక సంస్థల ఎన్నికల ముందు పార్టీ మార్పు పెద్ద చర్చకు కారణమవుతోంది. అంతేకాకుండా బొత్స సత్యనారాయణ వెనుక ఉన్నటువంటి కొంతమంది కేడర్ కూడా శ్రీను వెనకే వెళ్లడం రాజకీయంగా ఒక ప్రత్యేకమైనటువంటి చర్చకు కారణం అవుతుంది . ఆస‌క్తి పెంచుతోంది. తెలుగుదేశం పార్టీ అదేవిధంగా వైసీపీ మధ్య ఈసారి విజయనగరం జిల్లా స్థానిక సంస్థల ఎన్నికలు ఢీ అంటే ఢీ అనే విధంగా ఉండ‌నున్నాయి.

మ‌జ్జి శ్రీను వైసీపీలో ఉన్న సమయంలో రెండు పదవులు చేశారు. ఇప్పుడు టిడిపిలో ఎటువంటి పదవి లేదు. ఆయన టిడిపిలో చేరిన సమయంలో చాలామంది వ్యతిరేకించారు. కానీ చేరిన వెంట‌నే ఆయన కలుపుగోలుతనం జిల్లాలో నాయకులు అందరిని కలవడం ఇవన్నీ కూడా ఆయనని మరింత టిడిపికి దగ్గర చేస్తున్నాయి. కుమార్తెకి విజయనగరం మేయర్ టికెట్ ఇస్తారంటూ వార్తలు వినిపిస్తున్న వేళ జిల్లా బాధ్యతలు కూడా ఆయనకు ఇవ్వబోతున్నారని వార్తలు మరింత ఆసక్తి రేపుతున్నాయి. జిల్లాలో ప్రస్తుతం బాధ్యతలు అధ్యక్షుడిగా కిమిడి నాగార్జున చూస్తున్నారు. కిమిడి కుటుంబం నుంచి చాలా కీలకంగా ఉన్ననాయ‌కుడు నాగార్జున‌.

డిసిసిబి చైర్మన్ గా కూడా ఆయన బాధ్యతలు చేస్తున్నారు. ఇక ఒక పదవి నాగార్జునకి ఇచ్చి మరో కీలకమైనటువంటి జిల్లా పదవి చిన్న శీనుకి ఇవ్వాలని ఆలోచనలో చంద్రబాబు ఉన్నారని తెలుస్తోంది. లోకల్ బాడీ ఎలక్షన్స్ నోటిఫికేషన్ ముందే కీల‌క ప‌ద‌వి ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. లోకల్ బాడీ ఎలక్షన్ కి సంబంధించి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత రాజకీయాల్లో చాలా మార్పులు కనిపిస్తాయి. అనేకమంది నాయకులు పార్టీలు మారే అవకాశం ఉంటుంది.

అయితే ముందుగానే చిన్న శీనుకు అవకాశం ఇచ్చి జిల్లా బాధ్యతలతో పాటు జిల్లాలోని రాజకీయంగా ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో వందకి 100% గెలుపు తీసుకురావాలని టార్గెట్ కూడా ఇవ్వచ్చు అనే వార్తలు వినిపిస్తున్నాయి. జిల్లాలోని వైసీపీ తరఫున అన్ని తానై చూసుకున్న చిన్న శీను ఇప్పుడు టిడిపి తరఫున ఆ పదవి ఇస్తే ఎలా ముందుకు సాగుతారు అనేది కూడా పెద్ద చర్చ. ఇప్పటికే ఆయన బామ్మర్దిని వైసిపి నుంచి బయటకు పంపించడం జరిగింది. త్వరలో ఆయన కూడా టిడిపి కండువా కప్పుకోబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. మరోపక్క నెల్లిమర్ల రాజకీయం కూడా హీట్ ఎక్కుతోంది. ఇక విజయనగరం జిల్లాలో చిన్న శీను వెనుక మరింత మంది పార్టీలో చేరబోతున్నారని వార్తలు ఇంకా ఆసక్తిని రేపుతున్నాయి.

ఏది ఏమైనా జనవరి నాటికి మొత్తం లోకల్ బాడీ ఎలక్షన్స్ పూర్తవుతాయి అప్పటికే విజయనగరంలో చాలావరకు చిన్న శీను వెనుక ఉన్నటువంటి కేడర్ అంతా కూడా టిడిపి కండువా కప్పుకుంటారని ప్రచారం బాగా జరుగుతోంది. మరోపక్క వైసీపీ కూడా చాలా టార్గెట్గా ఇక్కడ రాజకీయాలు చేస్తోంది. ఎవరూ కూడా చిన్న శీను వెంట వెళ్లకూడదని షరతులు కూడా విధిస్తోంది.

ఇప్పటికే జిల్లాలో కొంద‌రు నేత‌లు టచ్ లోకి వెళ్లారని వార్తలు వినిపిస్తున్నాయి.. కానీ బొత్స మాత్రం చాలా ధైర్యంగా కనిపిస్తున్నారు ఏది ఏమైనా ఈసారి లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కచ్చితంగా వైసీపీ ఇక్కడ మెజార్టీ స్థానాలు దక్కించుకోవాలని పక్కా వ్యూహంతో వెళ్తోంది. చిన్న శీను పార్టీని వీడినా వైసీపీ క్యాడర్ తమవెంటే ఉందని చెప్పుకోవడానికి ఈ ఎలక్షన్స్ మరింత కీలకంగా కనిపించబోతున్నాయి.

రాజకీయంగా బొత్స కూడా మేనల్లుడు వెళ్లిపోయిన తాను కుమార్తె కుమారుడు అలాగే అందరూ కూడా పార్టీ తరఫున మీకు అండగా ఉంటామనే విషయాన్ని తెలియజేశారు. చూడాలి రానున్న రోజుల్లో విజయనగరం బాధ్యతలు చిన్న శీనుకి అప్ప‌చెబుతారా లేదా, ఇప్పుడు ఎవరికి ఉన్నాయో వారికి అప్పజెప్పి ఒకవేళ ఫలితాలు వచ్చిన తర్వాత అప్పుడు ఇస్తారా అనేది కాలమే తెలియచేస్తుంది.

Leave a Comment