ఏపీలో లోకల్ బాడీ ఎలక్షన్స్ హిట్స్ స్పష్టంగా కనిపిస్తోంది. ఈ సమయంలో కూటమి తరుపున టిడిపి జనసేన బిజెపి ఇంకా అభ్యర్థుల ప్రకటన చేయాల్సి ఉంది. ముందుగా రిజర్వేషన్ల ఖరారు అయిన తర్వాత దీనిపై పూర్తి క్లారిటీ వస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఈసారి గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ సమయంలో తొలి మేయర్ అభ్యర్థిగా వైసిపి ప్రకటన చేయడం ఇప్పుడు రాజకీయంగా ఆసక్తిని రేపుతోంది .
2024లో 11 స్థానాలకు పరిమితమైన వైసీపీ ఈసారి లోకల్ బాడీ ఎలక్షన్ లో ఎలాంటి ప్రభావం చూపిస్తుందనేది ప్రతి ఒక్కరు ఎదురుచూస్తున్నారు. ఈ సమయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు మేయర్ గా ఆనం విజయ్ కుమార్ రెడ్డి పేరును ప్రకటించారు.విజయకుమార్ రెడ్డి రూరల్ నియోజకవర్గానికి సమన్వయకర్తగా ఉన్నారు. స్వయాన జగన్ ఈ ప్రకటన చేయడం రాజకీయంగా ఆసక్తిని రేపుతోంది.
అంతేకాకుండా ఆయన భార్య కూడా చైర్ పర్సన్ గా ఇటీవలే పదవి బాధ్యతలు పూర్తి చేశారు. ఇప్పుడు ఆనం కుటుంబానికి చూసుకున్నట్లయితే సుమారు 45 ఏళ్లుగా నెల్లూరు జిల్లా రాజకీయాల్లో మంచి పేరు ఉన్న కుటుంబం. ఆ కుటుంబం నుంచి ఇప్పుడు ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి ఆయన పేరు ప్రకటించడం ఆసక్తిని
రేపుతోంది..
ఆనం రామ్ నారాయణ రెడ్డి అలాగే ఆనం వివేక ఇద్దరు కూడా గతంలో కాంగ్రెస్ పార్టీలో ఎంత సీనియర్లుగా పనిచేశారో తెలిసిందే. తర్వాత టిడిపిలో చేరారు ఆ తర్వాత వైసిపిలో చేరారు తర్వాత 2024 ఎన్నికల సమయానికి టిడిపిలో చేరడం జరిగింది. మొత్తానికి ఇప్పుడు అదే ఆనం కుటుంబం నుంచి ఇప్పుడు కీలకంగా ప్రకటన రావడం రాజకీయంగా కొత్త చర్చకు కారణమవుతోంది నెల్లూరు జిల్లాలో.
ఆదాలను పక్కనపెట్టి ప్రస్తుతం విజయ్ కు అవకాశం కల్పిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. అయితే గతంలో ఎస్టీ మహిళకు అక్కడ రిజర్వేషన్ ఖరారైంది వైసీపీ గతంలో 2021 లో నెల్లూరు గెలుచుకుంది .నెల్లూరు టికెట్ ఈసారి జనరల్ కి కేటాయించే అవకాశం ఉందంటూ వార్తలు వినిపిస్తుండగా నెల్లూరు నుంచి మేయర్ గా తొలి ప్రకటన అయితే జగన్మోహన్ రెడ్డి చేయడం చాలా ఆసక్తి రేపుతోంది .
ముఖ్యంగా ఏపీ లో 17 కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి ఎలక్షన్స్ ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి వరుస పెట్టి ఒక్కొక్కరి ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టు వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పటికే దానికి సంబంధించిన ఎక్సర్సైజ్ కూడా పార్టీ తరపున జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఎక్కడ ఏకగ్రీవాలు అవ్వకూడదు అంటూ కూడా గతoలో జగన్ ప్రకటన చేశారు. ఇప్పుడు అదే జోరుతో అదే స్పీడ్ తో జగన్ నిర్ణయాలు తీసుకుంటున్నారని తెలుస్తోంది ఏది ఏమైనా ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ కూటమి వర్సెస్ వైసీపీ మధ్య అసెంబ్లీ ఎలక్షన్స్ ని తలదన్నేలా జరుగుతాయనేది రాజకీయ విశ్లేషకులు కూడా తెలియజేస్తూ ఉన్నారు.







