వార‌ణాసి త‌ర్వాత మహేష్ ఆ డైరెక్ట‌ర్ తో మూవీ ?

ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా కాదు పాన్ వ‌ర‌ల్డ్ సినిమాగా చెప్పుకుంటున్నారు ఎస్ఎస్ రాజమౌళి అలాగే మహేష్ బాబుతో చేస్తున్నటువంటి వారణాసి సినిమా గురించి. ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా ఈ సినిమా గురించి ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఈ సినిమాలో మహేష్ బాబుని ఏ విధంగా ద‌ర్శ‌కుడు రాజమౌళి చూపిస్తారని ఆతృత‌ ప్రతి ఒక్కరిలో కనిపిస్తోంది. వేల కోట్ల రూపాయల బడ్జెట్ అనే టాకు వినిపిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా సుమారు 100 భాషలకు పైగానే ఈ సినిమా ఒకేసారి విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

టాలీవుడ్ లోనే కాదు బాలీవుడ్ హాలీవుడ్ రేంజ్ లో ఈ సినిమా గురించి చర్చ జరుగుతుంది. ఈ సమయంలో తాజాగా ఒక వార్త అయితే బాగా వైర‌ల్ అవుతోంది మహేష్ బాబుకి సంబంధించి. మహేష్ బాబుకి ఒక హిట్ బాకీ ఉన్నారట దర్శకుడు సుకుమార్. ఈ మాట ఎందుకు వ‌స్తుంది అంటే, స్వయంగా ఆయనే అంటే ద‌ర్శ‌కుడు సుకుమార్ ఈ మాట చెప్పారు. వారిద్దరి కాంబినేషన్లో వన్ నేనొక్కడినే సినిమా గ‌తంలో వచ్చింది. కానీ ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ తో ఈ సినిమా వచ్చినా ఈ సినిమా అనుకున్నంత రేంజ్ లో ఆడలేదు. మహేష్ కి ఫ్లాప్ వచ్చిందని చెప్పాలి.

క‌ధ ప‌రంగా ఈ సినిమా సూపర్ గా ఉంటుంది. కానీ ఎందుకో గాని ప్రేక్షకులకు అంతగా ఎక్కలేదు. ఇప్పటికీ సినిమా థియేటర్లో ఆడ‌లేదు కానీ ఇటు టీవీలో మాత్రం బ్రహ్మాండంగా చూస్తూ ఉంటారు. అయితే సుకుమార్ ఎప్పటికైనా ఓ సాలిడ్ హిట్ ఇస్తానంటూ మీడియా ముఖంగానే ఛాలెంజ్ చేశారు ఒక సందర్భంలో. మహేష్ బాబు సుకుమార్ కాంబినేషన్ ఎప్పుడు వస్తుందంటూ బాబు ఫ్యాన్స్ కూడా ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నారు.

వన్ నేనొక్కడినే సినిమా కంటెంట్ పరంగా సూపర్ గా ఉన్నా ఆడియన్స్ ని ఆకట్టుకోలేకపోయింది. సో మహేష్ బాబు సుకుమార్ కాంబినేషన్ సెట్ అయ్యే సూచనలు తాజాగా కనిపిస్తున్నాయని, ఫాన్స్ కి ఒక గుడ్ ట్రీట్ అంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ప్రస్తుతం మహేష్ బాబు వారణాసి సినిమా షూటింగ్ తో చాలా బిజీగా ఉన్నారు. ఆ తర్వాత ఆయన ఏ సినిమా చేస్తారు అని చర్చ అయితే బాగా జరుగుతుంది. ఈ సమయంలో దర్శకులు లిస్టులో సుకుమార్ పేరు కూడా ముందు వరుసలో వచ్చినట్టు వార్తలు అయితే వినిపిస్తున్నాయి.

రాజమౌళి దర్శకత్వంలో వారణాసి సినిమాకి మహేష్ చాలా కష్టపడుతున్నారు. ఈ సినిమా గురించి ఎంత ప్లానింగ్ వర్కౌట్ చేస్తున్నారో స్పష్టంగా తెలిసింది. సో మొత్తానికి నెక్స్ట్ ఆయన ఎవరితో సినిమా చేయబోతున్నారని చర్చ ఆరు నెలల నుంచి సాగుతోంది. ప్ర‌స్తుతం సుకుమార్ దగ్గరికి వచ్చి ఈ పేరు ఆగింది. మొన్నటి వరకు చూస్తే సందీప్ రెడ్డి వంగ పేరు వినిపించింది. అయితే ఆయన చాలా బిజీగా ఉన్నారు. ఆయ‌న స్పిరిట్ సినిమా చేస్తున్నారు ఆ సినిమా త‌ర్వాత యానిమ‌ల్ పార్క్ చేయ‌నున్నారు.

ఆ తర్వాత ఇక మహేష్ బాబుని లైన్లో పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపద్యంలో సుకుమార్ కి మహేష్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇస్తే వీరిద్దరి కాంబినేషన్లో సినిమా సెట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఇది రూమర్ గా మిగిలిపోతుందా లేదంటే పక్కగా సినిమా చేస్తారా కాంబినేషన్ వీరికి సెట్ అవుతుందనేది కచ్చితంగా వారణాసి సినిమా విడుదల తర్వాతే పూర్తి క్లారిటీ వస్తుంది. సో మొత్తానికి సుకుమార్ కూడా చాలా బిజీగానే ఉన్నారు.

సుకుమార్ ప్ర‌స్తుతం రెండు కథలు కూడా రాస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. అలాగే చరణ్ తో సినిమా కంప్లీట్ చేయాల్సి ఉంది. ప్రస్తుతం ఆ సినిమా వర్క్ లో కూడా చాలా బిజీగా ఉన్నారు. ఏది ఏమైనా బాబు అభిమానులు మాత్రం ఈ వార్త విని వన్ నేనొక్కడినే తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో ఎలాంటి సినిమా వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. తెలుగు ఇండస్ట్రీలోని ఇప్పుడు రాజమౌళి చేస్తున్నటువంటి వారణాసి సినిమా గురించి పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. సాధారణంగా చూసుకుంటే మహేష్ బాబుని హాలీవుడ్ రేంజ్ హీరో అంటారు .ఇప్పుడు హాలీవుడ్ లో కూడా వారణాసి సినిమా కొత్త చరిత్ర లిఖించ‌నుంది. సో చూడాలి రానున్న రోజుల్లో వీరి కాంబినేషన్ వస్తుందా లేదా ఒక రూమర్ గా మిగులుతుంది అనేది.

Leave a Comment