ఏపీలో లోకల్ బాడీ ఎలక్షన్స్ హిట్ స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ లో కార్పొరేషన్ ఎలక్షన్ కి సంబంధించి ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందా అని పెద్ద ఎత్తున అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. టికెట్ ఇస్తే పోటి చేద్దామని పార్టీల తరపున అందరూ అవకాశం కోసం పోటీ పడుతున్నారు. రోజురోజుకీ లిస్టు పెరుగుతూనే ఉంది. ముఖ్యంగా టిడిపిలో మూడు సెగ్మెంట్ల కార్పొరేషన్ గురించి పెద్ద ఎత్తున అందరూ కూడా
ఫోకస్ చేశారు.
ఒకటి విశాఖపట్నం, రెండు విజయవాడ, మూడు తిరుపతి. సీట్ల సర్దుబాటులో భాగంగా ఈ మూడు ప్రాంతాలు కార్పొరేషన్ల టికెట్లు ఎవరెవరు తీసుకుంటారు అనేది ఒక చర్చ నడుస్తోంది. విశాఖపట్నం చూస్తే చాలామంది పేర్లు వినిపిస్తున్నాయి. టిడిపి నుంచి దాదాపు నలుగురి పేర్లు వినిపిస్తుంటే వైసీపీ నుంచి ఇద్దరి పేర్లు వినిపిస్తున్నాయి. బీజేపీ ఇప్పటివరకు రేస్ లో లేకపోయినా తాజాగా రేస్ లోకి కూడా వచ్చింది. విశాఖ మేయర్ కోసం రేస్ లో సీఎం రమేష్ భార్య పేరు ఇప్పుడు తెరమీదకి రావడం రాజకీయంగా ఆసక్తిగా కనిపిస్తోంది.
2024 ఎన్నికల్లో ఉత్తరాంధ్రలోని అనకాపల్లి ఎంపీ సీటుకి పోటీ చేసి బిజెపి నుంచి ఎంపీ అయ్యారు సీఎం రమేష్. ఆయన ఈ రెండేళ్లుగా తన పట్టు పెంచుకున్నారు . ఒకవేళ మహిళా కోటాలో అవకాశం వస్తే బిజెపి తరఫున విశాఖ నుంచి మేయర్ గా తన భార్యని పోటికి నిలపాలి అని ఆయన ఆలోచన చేస్తున్నారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. రెండు రోజులుగా ఆమెను పోటీకి దింపే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇక వైసిపి నుంచి ఇద్దరు మాజీ ఎమ్మెల్యేల పేర్లు వినిపిస్తుంటే, టిడిపి నుంచి గంటా రవితేజ పేరు వినిపిస్తోంది. ఇక బండారు సత్యనారాయణ కుమారుడు అప్పలనాయుడు పేరు కూడా తెర మీదకి వస్తుంది. వైసీపీ నుంచి ఇద్దరు టిడిపి నుంచి నలుగురు ఈ రేసులో వినిపిస్తూ ఉన్నారు. సో చూడాలి రానున్న రోజుల్లో ఇక్కడ ఎవరు పోటీకి నిలుస్తారు అనేది. పొత్తులో భాగంగా తిరుపతి, విశాఖ, విజయవాడ ఒక్కొక్కరు ఒక్కో స్దానంలో పోటికి ఉండవచ్చు అంటున్నారు.







