బొప్పాయి గింజ‌ల‌తో మిరియాలు క‌ల్తీవామ్మో ఇలా ప‌సిగ‌ట్టండి..!

ఈ రోజుల్లో ఏది చూసినా క‌ల్తీ క‌నిపిస్తోంది. ముఖ్యంగా ఫుడ్ విష‌యంలో ఎంతో జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి. బ‌య‌ట హోట‌ల్స్ లో ఏమైనా తిందాం అన్నా ఇలాంటి ప‌రిస్దితి క‌నిపిస్తోంది. ముఖ్యంగా వంటింటి సామాన్లు కిరాణా వ‌స్తువుల విష‌యంలో కూడా జాగ్ర‌త్త‌గా చూసుకోవాల్సిందే.

తాజాగా కారం పాలు మ‌సాలా ఇలా అన్నీ కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు చెకింగ్ చేసి, అనేక మంది క‌ల్తీ రాయుళ్ల ఆట‌క‌ట్టిస్తున్నారు. ఇక టీపొడి కూడా చాలా మంది చింత‌గింజ‌ల పొడి క‌లుపుతూ క‌ల్తీ చేస్తున్నారు.

అయితే మిరియాల విష‌యంలో కూడా ఇటీవ‌ల 40 ల‌క్ష‌ల రూపాయ‌ల స‌రుకు ప‌ట్టుకున్నారు. ముఖ్యంగా బొప్పాయి గింజ‌ల‌ను ఎండ‌బెట్టి మిరియాల్లో వీటిని క‌లిపి క‌ల్తీ చేస్తున్నారు. దీని వ‌ల్ల క‌డుపు స‌మ‌స్య‌లు కూడా వ‌స్తాయి.

అంతేకాదు కొంద‌రికి ఆగ‌ని మోష‌న్స్ స‌మ‌స్య‌లు వ‌స్తాయి, ఈ క‌ల్తీ మిరియాలు తింటే గ‌ర్భిణీల‌కు ఇది పెద్ద స‌మ‌స్య‌గా మారుతుంది. అందుకే ఒరిజిన‌ల్ మిరియాలు చూసి కొనుగోలు చేయాలి. అయితే మిరియాలు ఒరిజిన‌ల్ అవునా కాదా అనేది ఎలా తెలుసుకోవాలో చూద్దాం.

ముందుగా ఒక గ్లాసు నీటిని తీసుకోండి. అందులో కొన్ని మిరియాలు వేయండి. నీటిలో తేలుతున్న గింజలను ప్రత్యేకంగా పరిశీలించండి అవి క‌ల్తీ . ఎందుకంటే నీటిలో బొప్పాయి గింజలు తేలుతాయి, ఒరిజిన‌ల్ మిరియాలు అడుగున చేరుతాయి.

ఇక మిరియాలు న‌లిపితే ఘాటు వాస‌న‌ వ‌స్తాయి. అలాగే లోప‌ల మ‌రో తెల్ల‌టి గింజ‌ను క‌లిగి ఉంటాయి.

ముదురు గోధుమ నుంచి నలుపు రంగులో ఉన్న మిరియాలు మాత్ర‌మే తీసుకోండి ఇవి ఒరిజిన‌ల్.

ఇక మిరియాలు ముడ‌లు అలాగే చెక్కుడుగా ఉంటాయి. రౌండ్ గా ఉండి ఎలాంటి చెక్కుడు లేక‌పోతే అవి బొప్పాయి గింజ‌లు అని గుర్తించండి, ఆకారంలో ఇవి నున్న‌గా ఉంటాయి.

మిరియాలు చేతిలో నొక్క‌గానే విర‌గ‌వు అనేది మ‌ర‌వ‌కండి.

Leave a Comment