ఉత్తరాంధ్రలో కీలకంగా ఉన్నటువంటి విశాఖ విజయనగరం శ్రీకాకుళం ఈ మూడు జిల్లాలకు సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా తీసుకుంటున్నటి వంటి నిర్ణయాలు వైసీపీలో పెద్ద ఎత్తున చర్చకు కారణం అవుతున్నాయి. ఉత్తరాంధ్రాలో కేవలం రెండు కుటుంబాలకే అక్కడ బాధ్యతలు అప్పగించారా అంటే అవుననే సమాధానాలు సొంత పార్టీ నేతల నుంచి వినిపిస్తున్నాయి. అక్కడ జిల్లా బాధ్యతలు వేరే వారు చూస్తున్నా వీరిద్దరి ఫైనల్ డెసిషన్ నడుస్తుంది అంటున్నాయి ఫ్యాన్ పార్టీ వర్గాలు.
ఎందుకంటే బొత్స సత్యనారాయణ భార్య ఝాన్సీ కి విశాఖపట్నం ఎంపీ టికెట్ అవకాశం ఇచ్చారు.
అలాగే ఆయన మేనల్లుడు మజ్జి శ్రీనుకి కూడా జిల్లా మూడు పదవులు ఇచ్చారు జగన్. ప్రస్తుతం శ్రీను తెలుగుదేశం పార్టీలో చేరిపోయినటువంటి పరిస్థితి. ఇక నెల్లిమర్లలో కూడా సన్యాసినాయుడు పేరుని కూడా బొత్స తెలియజేశారు. ఇలా జిల్లాలో అనేక పదవులు బొత్స సత్యనారాయణ ఎవరికి చెప్తే వారికిచ్చారు జగన్.
చెప్పాలంటే విశాఖతో పాటు విజయనగరంలో కూడా ఆయన హవా కొనసాగుతోంది అని చెప్పాలి. మరోపక్క భీమిలి నియోజకవర్గం అవకాశం కూడా బొత్స కుమార్తె అనూషకి కల్పించారు. తమ్మినేని సీతారాం అదేవిధంగా ధర్మాన ప్రసాదరావు ఈ రెండు కుటుంబాలకు సంబంధించి శ్రీకాకుళం జిల్లాలో కూడా జగన్మోహన్ రెడ్డి వీరి మాటే వింటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ రెండు కుటుంబాలే మూడు జిల్లాలను శాసిస్తున్నాయి అనేది స్పష్టంగా తెలుస్తోంది.
గతంలో కాంగ్రెస్ పార్టీలో హవా కొనసాగించిన ఇద్దరు కూడా ప్రస్తుతం వైసీపీలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి. వేరే పార్టీ నుంచి సీనియర్లు వచ్చినా మాజీలు వచ్చినా వారి హవా కొనసాగడం లేదు. బొత్స హవా అలాగే ధర్మాన హవా కొనసాగుతోంది. సో 2028 లో జమిలి ఎన్నికలు వచ్చినా లేదా 2029 లో సాధారణ ఎన్నికలు జరిగినా వీరి హావా కొనసాగవచ్చు అని జిల్లాలోనే కాదు ఉత్తరాంధ్రా అంతా మాట్లాడుకుంటున్న పరిస్దితి.







