మనదేశ చలనచిత్ర పరిశ్రమలో బయోపిక్ హవా ఎప్పటినుంచో కొనసాగుతోంది. ఇప్పటి దర్శకులు ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా చాలామంది హీరోయిన్లు అలనాటి చరిత్రలో నిలిచిపోయిన గొప్ప వ్యక్తుల జీవితాలను ప్రాణం పెట్టి నటిస్తున్నారు. అంతేకాకుండా వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరిస్తున్నారు. నటీనటులు చేస్తున్న సినిమాలు కూడా అవార్డులు పొందుతున్నాయి.
నేషనల్ క్రష్ రష్మిక చాలా పెద్ద బాధ్యతను తన భుజాన వేసుకున్నారు. భారతరత్న పొందిన మొట్టమొదటి సంగీత విద్వాంసురాలు ఎమ్మెస్ సుబ్బలక్ష్మి బయోపిక్ లో ఆమె నటించబోతున్నారు. ఈ వార్త నిజంగా అందరినీ ఒక్కసారిగా ఆసక్తి కలిగించింది.
ఈ బయోపిక్ ఎప్పుడు వస్తుందని ఎదురు చూసేలా ఆసక్తి కలిగిస్తోంది. ఎన్నో గ్లామర్ పాత్రలు పోషించిన రష్మిక ఇప్పుడు తన యాక్టింగ్ తో టాలెంట్ తో ఈ బయోపిక్ లో ఎలా కనిపిస్తారా అని అందరూ ఎదురు చూస్తున్నారు.
ఈ బాధ్యతను ఎలా మోస్తుందో కూడా చూడాలి. సౌత్ లో హీరోయిన్స్ చేసిన బయోపిక్స్ అంటే మనకు ఫస్ట్ మహానటి సినిమా సావిత్రి పాత్ర చేసినటువంటి కీర్తి సురేష్ గుర్తుకు వస్తుంది. చెప్పాలంటే క్లైమాక్స్ లొ ప్రేక్షకులని కన్నీళ్లు పెట్టించింది కీర్తి సురేష్. ఈ సినిమాలో నటనకి జాతియ అవార్డు కూడా అందుకుంది.
డర్టీ పిక్చర్ చిత్రంలో సిల్క్ స్మిత పాత్రలో విద్యాబాలన్ అద్భుతంగా చేసింది .ఇక అలియా భట్ కూడా ముంబై మాఫియా క్వీన్ గంగుబాయి జీవిత ఆధారంగా వచ్చిన గంగుబాయి కఠియావాడి చిత్రంలో నటించింది. ఇలా చాలా మంది తారలు ఎన్నో అద్భుత జీవిత చరిత్రల్లో నటించారు. మరి రష్మిక చిత్రం పై కూడా అంతే ఆసక్తి ఇప్పుడు నెలకొంది.







