తిరుపతిలో లోకల్ ఫైట్ ఓ రేంజ్ లో ఉండనుంది. ఈసారి తెలుగుదేశం జనసేన బీజేపీ తరపున చాలా మంది ఆశావహుల పేర్లు తెరపైకి వస్తున్నాయి. ముఖ్యంగా వైసీపీ తరపున డివిజన్ స్దాయి నాయకులు ఇద్దరు రేసులో ఉన్నారు. అయితే తెలుగుదేశం పార్టీ నుంచి నలుగురి పేర్లు బాగా వినిపిస్తున్నాయి. మరి ఎవరు అనేది ఓసారి చూద్దాం. అసలు ఈసారి మేయర్ రిజర్వేషన్ ఏ కేటగిరీకి వస్తుంది? జనరల్ వస్తుందా? జనరల్ మహిళకు వస్తుందా? బీసీకి వస్తుందా? ఇది అన్నింటికంటే ఇంట్రస్టింగ్ అంశంగా మారింది టెంపుల్ సిటీలో.
తిరుపతిలో బలిజ ఓటు బ్యాంకు బలంగా ఉంటుంది, వారినుంచి ముగ్గురు రేసులో ఉన్నారు. టీడీపీకి చెందిన ఎడిఫై విద్యాసంస్థల అధినేత పెనుమాదు ప్రణీత్‌పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఇటు నారా కుటుంబానికి అలాగే హీరో రోహిత్ కి మంచి స్నేహితుడు, ఇక మహిళలకు కేటాయిస్తే ఆయన తల్లి పెనుమాదుల సులోచనమ్మ పేరు వినిపిస్తోంది.
ఇక మరొకరు చూస్తే, తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ మనవరాలు కీర్తి పేరు కూడా వినిపిస్తోంది. సుగుణమ్మ ఇప్పటికే కీర్తిని పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేలా చేశారు, గ్రౌండ్ లెవల్లో ఆమె వర్క్ చేస్తున్నారు. ఆమె పేరు కూడా వినిపిస్తోంది. ఇక్కడ ఒక అంశం ఏమిటి అంటే స్దానికంగా బలిజ సామాజిక వర్గానికి చెందిన జనసేన నేత ఆరణి శ్రీనివాసులు ఎమ్మెల్యేగా ఉన్నారు. అందుకే మేయర్ బీసీకు ఇవ్వచ్చు అని చర్చ నడుస్తోంది.
ఇక బీసీలకు ఇస్తే ఇక్కడ రేసులో ధంపూరి భాస్కర్ యాదవ్ పేరు బలంగా వినిపిస్తోంది. పట్టణ టీడీపీ అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం కూడా ఉంది. అలాగే మహిళకు కేటాయిస్తే ఆయన భార్య దంపూరి లావణ్య పేరు కూడా తెరమీదకు వస్తోంది.
ఇక రెడ్డి సామాజిక వర్గం నుంచి కూడా మేయర్ పదవిపై ఆశలు పెట్టుకున్న నేతలు ఉన్నారు.మబ్బు దేవనారాయణరెడ్డి పేరు వినిపిస్తోంది. మాజీ ఎమ్మెల్యే మబ్బు రామ్‌రెడ్డి కుమారుడిగా ఆయన పార్టీలో చాలా యాక్టీవ్ గా తిరుగుతున్నారు. ఆయన పేరు వినిపిస్తోంది. ఇక జనసేన తరపున కిరణ్ రాయల్ పేరు వినిపిస్తోంది. అలాగే తిరుపతి నుంచి మహిళా కోటాలో సుభాషిణి పేరు వినిపిస్తోంది. సో చూడాలి ఇక్కడ ఈసారి టికెట్ ఎవరికి దక్కనుందో.







