తెలంగాణ కాంగ్రెస్ కి కొత్త ఇంచార్జ్ రాబోతున్నారా?

తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇన్‌ఛార్జ్, అవుత‌ను ఇప్పుడు ఇదే వార్తపై తెలంగాణ రాజకీయాల్లో ప్రత్యేక చర్చ నడుస్తోంది. మీనాక్షి నటరాజన్ స్థానంలో తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇన్‌ఛార్జ్ ఎవరిని నియమిస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది. అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తాజాగా ఆమె విదేశాల్లో చ‌దువుకునేందుకు వెళుతున్నారు అనే వార్త‌లు వినిపిస్తున్నాయి. అందుకే ఆమె ఈ బాధ్య‌త‌ల నుంచి త‌ప్పుకుంటారు అని కాంగ్రెస్ వ‌ర్గాల్లో చ‌ర్చ న‌డుస్తోంది.

ఇప్పుడు ఈ కొత్త బాధ్యతలు అధిష్టానం ఎవరికి అప్పగించబోతోంది. ఇదే ఒక చర్చ నడుస్తుంది. ఎన్నో రోజులుగా విదేశాల్లో ఉన్నత విద్య‌ చదువుకోవాలని మీనాక్షి నటరాజ్ ఆశిస్తున్నారు. అలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే 10 నెలలు విదేశాల్లో చదువుకున్నారు. అప్పట్లో రాహుల్ కూడా ఒకే చెప్పారు.

కానీ ఉన్నత చదువులు కోసం అవకాశం వస్తే వదులుకోకూడ‌దు అనే కార‌ణంతో ఆమె ఈ నిర్ణ‌యం తీసుకున్నారు.

త్వరలోనే మళ్లీ మరో రెండు నెలలు ఆమె విదేశాలకు వెళ్లబోతున్నారని తెలుస్తోంది. అందుకే మీనాక్షి ప్లేస్ లో కొత్తవారు రావడం పక్కా అనే వార్తలు వినిపిస్తున్నాయి.ఈ ప‌ద‌వి రేస్ లో ఇద్దరు నాయకుల పేర్లు తెరమీదకు వస్తున్నాయి. తమిళనాడుకు చెందిన ఇద్దరులో ఎవరో ఒకరికి కచ్చితంగా తెలంగాణ కాంగ్రెస్ బాధ్యతలు అప్పగించబోతున్నారని తెలుస్తోంది.

ముందు వరుసలో ఎంపీ సింథిల్ పేరు వినిపిస్తోంది. రాహుల్ గాంధీకి ఆయన కోటరీలోనే కీలకంగా ఉన్నారు. మరొక నాయకుడు మాజీ ఎంపీ చల్లాకుమార్ ఆయన పేరు కూడా వినిపిస్తోంది. తమిళనాడులో కీలక నాయకుడు ముకుల్ వాస్నిక్ పేరు కూడా పరిశీలనలో ఉంది. ఆయనకి తెలంగాణ కాంగ్రెస్ లో ఉన్న నాయకులతో మంచి సంబంధాలు ఉన్నాయి. ఆయనకు కూడా ఇంచార్జ్ పదవి బాధ్యతలు ఇవ్వ‌చ్చంటూ వార్త‌లు వినిపిస్తున్నాయి. చూడాలి ఈ అవ‌కాశం ఎవ‌రికి రానుందో.

Leave a Comment