ప్లీజ్ న‌న్ను అలా పిల‌వ‌ద్దు – చిన్న‌శ్రీను..

మ‌జ్జి శీను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆయన కుమార్తె సిరి సహస్ర కూడా పార్టీని వీడ‌టం జ‌రిగింది, అయితే విజయనగరం మేయర్ టికెట్ రేస్ లో ఆమె పేరు ప్ర‌ముఖంగా వినిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ త‌ర‌పున ఆమెకి టికెట్ రానుంది అని వార్త‌లు వినిపిస్తున్నాయి. మ‌రి ఇప్ప‌టికే చాలా మంది ఈ రేస్ లో ఉన్నారు, వారిని కాదు అని ఆమెకి టికెట ఇస్తారా అనే చ‌ర్చ న‌డుస్తోంది.

ఇటువంటి సమయంలో మీడియా ముఖంగా చిన్న శ్రీను ఒక విష‌యం తెలిపారు. తనని మీడియాలు అదేవిధంగా ఛానల్స్ లో ప్రముఖంగా బొత్స‌ మేనల్లుడు అంటూ పిలుస్తున్నారని దయచేసి అలా పిలవద్దంటూ రిక్వెస్ట్ చేశారు. తనకంటూ ఒక పేరు ఉందని, స్వ‌తంత్రంగా తాను రాజకీయంగా ఎదిగాను అని తెలిపారు ఆయ‌న‌.

జిల్లాలో త‌న‌కు ప్రత్యేక గుర్తింపు కేడర్ ఉందని, చిన్న‌శ్రీను లేదా మ‌జ్జి శ్రీను అని త‌న‌ని సంభోందించండి అని మీడియాకు తెలియజేశారు.

ఆయన పార్టీ వీడిన తర్వాత మజ్జి శీను అనే పేరు కాకుండా బొత్స మేనల్లుడు అంటూ పెద్ద ఎత్తున వార్తలు మీడియాలో వచ్చాయి. ఈ సమయంలో తాను స్వతంత్రంగా ఎదిగిన వ్యక్తిని మ‌రో కార్డు నాకు వ‌ద్దు అంటూ ఆయ‌న నేరుగా తెలిపారు. ఆయన పార్టీని వీడిన సందర్భంగా మూడు పదవులకు రాజీనామా చేశారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ కి విజయనగరం బాధ్యతలు అప్పగించారు జగన్. అలాగే నెల్లిమర్లలో కూడా ఆయన వియ్యంకుడు అప్పలనాయుడు పదవికి కూడా జగన్ చెక్ పెట్టారు.

ఈ సమయంలో సన్యాసినాయుడికి ఇంచార్జ్ బాధ్యతలు అప్పగించారు. రానున్న రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు విజయనగరం జిల్లాలో ఎటువంటి మలుపులు తిప్పుతాయో చూడాలి. ముఖ్యంగా సన్యాసినాయుడు జడ్పిటిసిగా ఉన్నారు . ఆయనకి నెల్లిమర్ల వైసీపీ బాధ్యతలు అప్పగించారు జగన్ . నెల్లిమర్లలో వైసిపి ఇన్చార్జిగా ఇప్పటివరకు కొనసాగిన అప్పలనాయుడు పార్టీ మారతారా సాధారణంగానే కొనసాగుతారనేది ఒక చర్చ.

Leave a Comment