సాధారణంగా తెలుగులో సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే ముందు ఓవర్సీస్ లో మార్కెట్ హైప్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇక పెద్ద సినిమాలకైతే దాని గురించి ఎంత చెప్పినా తక్కువే. స్టార్ల సినిమాలకు ఓవర్సీస్ లో ఎటువంటి హైప్ ఉంటుందో దాదాపు సినిమా రిలీజ్ కి వారం ముందే కనిపిస్తూ ఉంటుంది. తాజాగా నాచురల్ స్టార్ నాని సినిమా ప్యారడైస్ గురించి ఇప్పుడు పెద్ద ఎత్తున ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా సాంగ్స్ ఎంత పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయో తెలిసింది.
ఇక సినిమా స్టోరీ గురించి కూడా పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి. నానిని తెరపై మాస్ యాక్షన్ తో చూడాలంటూ ఫ్రాన్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇక దర్శకుడు శ్రీకాంత్ ఓదెల నానిని ఏ విధంగా చూపిస్తారా అంటూ ఆసక్తి కనిపిస్తుంది. ది ప్యారడైజ్ ఈనెల సెప్టెంబర్ 24వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతుంది. అయితే అడ్వాన్స్ బుకింగ్స్ లో మాత్రం కొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది నాని సినిమా.
నార్త్ అమెరికాలో ప్రీమియర్ షోలకి ఇప్పటికే మూడు లక్షల డాలర్ల వసూళ్ల మార్క్ దాటేసింది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈ సినిమాకి ఎంత క్రేజ్ ఉంది అనేది. రాత్రి అమెరికాలో ఇలా బుకింగ్ ఓపెన్ అయ్యాయి వెంటనే టికెట్స్ హాట్ కేకుల్లా మార్కెట్లో అమ్ముడయ్యాయి. దీనిబట్టి అర్థమవుతుంది ఈ సినిమా కోసం ఎంతలా ఎదురుచూస్తున్నారో.
నాని నటనకు తోడు శ్రీకాంత్ ఓదెల మాస్ టేకింగ్ తోడవడం ఈసారి రెస్పాన్స్ మామూలుగా ఉండదంటూ ఫ్యాన్స్ కూడా చెప్తున్నారు. బుకింగ్స్ దాదాపు మరో 12 గంటల్లోనే ఐదు లక్షల డాలర్ల వరకు ఈ యొక్క వసూళ్లు రావచ్చంటున్నారు. ప్యారడైజ్ సినిమా గురించి ప్రీ సేల్స్ విభాగం సరికొత్త రికార్డులు నెలకొల్పవచ్చు అంటూ
తెలియజేస్తుంది. మొత్తానికి ది ప్యారడైజ్ సినిమా మీద హైప్ చూస్తే ఈ సినిమా కొత్త రికార్డులు క్రియేట్ చేయడం పక్కా అనేది తెలుస్తోంది. ఇక ఓవర్సీస్ లో ఇలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ఇంకెన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.







