తిరుమ‌ల ఏడు కొండ‌ల చ‌రిత్ర‌..

ఆంధ్రప్రదేశ్ లోని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఆలయం. తిరుపతి జిల్లాలోని తూర్పు కనుమల్లో శేషాచలం కొండల్లో ఉన్న ఏడు శిఖరాలని ఏడుకొండల అని పిలుస్తారు. అంతేకాకుండా సప్తగిరిలు అని కూడా పిలుస్తూ ఉంటారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని నిత్యం ల‌క్ష‌ల మంది ద‌ర్శించుకుంటారు. అసలు పురాణాల ప్రకారం ఇక్కడ ఏడుకొండల పేర్లు ఏ విధంగా వచ్చాయి ఒకసారి మనం వాటి గురించి క్లుప్తంగా తెలుసుకుందాం.

ముందుగా శేషాద్రి కొండ ఆదిశేషుడు పేరు మీద ఈ కొండగా పేరు వచ్చింది అని చెప్తారు. స్వామి వారి దాస భక్తికి ఇది నిదర్శనంగా తెలియచేస్తుంటారు.

అంజనాద్రి అంజనాద్రి అంటే వెంటనే మనకి హనుమంతుడి తల్లి అంజనాదేవి గుర్తుకు వస్తుంది. ఆమె ఈ కొండపైనే తపస్సు చేసి ఆంజనేయుడికి జన్మనిచ్చింది అందుకే అంజనాద్రి అంటారు.

నారాయణాద్రి నారాయణ మహర్షి ఇక్కడ తపస్సు చేయడం వల్ల ఆయన పేరు ఎక్కడ స్థిరపడింది.

ఇక నీలాద్రి స్వామి వారికి తలనీలాలు సమర్పించిన మొదటి భక్తురాలు నీలాదేవి చరిత్రలో నిలిచింది అందుకే ఇక్కడే భక్తులు వెంకన్నకు తలనీలాలు ఇస్తారు.

గరుడాద్రి మహావిష్ణువు వాహనం గరుత్మంతుడు వైకుంఠం నుంచి ఈ కొండను భూమిపైకి తెచ్చారని పురాణాలు కూడా తెలియచేస్తున్నాయి.

నంది వృషభం అంటారు.వృషభాసురుడు అనే భక్తుడు ఇక్కడ తపస్సు చేయడం వ‌ల్ల ఈ కొండ‌కు వృషభాద్రి అనే పేరు వ‌చ్చింది.

వెంకటాద్రి వెంకటేశ్వర స్వామి ఆలయం అందరూ ప్రత్యక్షంగా చూసేటటువంటి ఆనంద నిల‌యం ఇక్క‌డే ఉంటుంది. అందుకే ఎంతో భక్తి పారవత్యంతో ఆ వెంకన్నను ఇక్కడ భ‌క్తులు దర్శించుకుంటారు

Leave a Comment