చిరంజీవి 2 సినిమాల‌పై క్లారిటీ వ‌చ్చేసింది..

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కాకా సినిమాని శరవేగంగా చేస్తున్నారు. అంతేకాకుండా దాదాపు మూడేళ్ల క్రితం మొదలైనటువంటి విశ్వంభర సినిమాని కూడా పూర్తి చేశారు. విశ్వంభర సినిమా ఇంకా విడుదల కాకపోవడంతో మెగా అభిమానులు కూడా విశ్వంభరా ఎప్పుడు వస్తుందని ఎదురుచూస్తున్నారు. ఇటీవల కాకా సినిమాకి సంబంధించి సంక్రాంతికి విడుదల చేస్తున్నామనే ఒక ప్రకటన కూడా ఇచ్చేసింది చిత్ర యూనిట్. ముందు మొద‌లైన విశ్వంభ‌ర మాత్రం ఇంకా ఆల‌స్యం అవుతోంది.

ఈ ప్రకటన వచ్చిన తర్వాత మరో కొత్త వార్త కూడా వైర‌ల్ అయింది. సంక్రాంతి రేసు నుంచి కాకాని తప్పిస్తున్నారని కాకా సినిమా కాకుండా విశ్వంభరా ఈ సంక్రాంతిలో వస్తుందని వార్తలు వినిపించాయి. కానీ వెంటనే చిత్ర
యూనిట్ అల‌ర్ట్ అయింది. కాకా సినిమా ఖచ్చితంగా సంక్రాంతికి విడుదల చేస్తామని క్లారిటీ ఇచ్చేశారు. విశ్వంభరా కోసం కాక పోస్ట్ పోన్ అవ్వ‌డం లేదు అనేది క్లారిటీ వ‌చ్చేసింది.

తాజాగా మెగాస్టార్ చిరంజీవి అలాగే కాకా విశ్వంభ‌రా సినిమాల ప్రొడ్యూసర్స్ కలిసిన ఒక ఫోటో ఇప్పుడు వైర‌ల్ అవుతోంది. ఎటువంటి క్లాషెస్ లేకుండా మెగాస్టార్ చిరంజీవి మొత్తం ఇద్దరితో కూడా మాట్లాడిన‌ట్లు స్పష్టంగా తెలుస్తోంది. జనవరి 13 ప్రపంచ వ్యాప్తంగా కాకా సినిమా రిలీజ్ అవుతుందని కెవిఎన్ ప్రొడక్షన్ ఒక క్లారిటీ ఇచ్చేసింది. సో స్పష్టంగా తెలియజేసింది. ప్రణాళిక బద్ధంగానే సినిమా షూటింగ్ జరుగుతోంది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా పూర్తి చేయబోతున్నారు. వచ్చే నెల ఫ‌స్ట్ సింగిల్ కూడా రిలీజ్ చేయ‌నున్నారు. సో మొత్తానికి ప్రకటన రావడంతో మెగా ఫాన్స్ కి ఒక మంచి గిఫ్ట్ ఇచ్చే వార్త అని చెప్పుకోవాలి.

Leave a Comment