మోకాళ్ల నొప్పులు ఈ చిన్న త‌ప్పులు చేయ‌వ‌ద్దు – డాక్ట‌ర్లు..

చాలామంది ఎక్కువ సేపు ఎక్కువ దూరం నడిస్తే శరీరం చాలా ఫిట్ గా ఉంటుందని భావిస్తూ ఉంటారు. అయితే ఎక్కువ మెట్లు ఎక్కినా సరే మోకాళ్ల నొప్పులు ఏమి ఉండవు నడక మంచిదే కదా అని భావిస్తూ ఉంటారు. ఇక్క‌డ గ‌మ‌నించాల్సంది అతి ఏదైనా ముప్పు అనేది గుర్తించాలి. ముఖ్యంగా మోకాళ్లపై బరువు పడటం అతిగా నడిచి మెట్లు ఎక్క‌డంలాంటివి చేయవ‌ద్దని వైద్యులు కూడా తెలియచేస్తున్నారు. వాకింగ్ చేయడం వేరు పైకి మెట్లు ఎక్కి మెట్లు దిగడం వేరు అనేది కూడా ఇటీవల వైద్యులు తెలియజేస్తున్నారు.

మోకాళ్లు మన శరీర బరువు మొత్తం మోస్తూ రోజంతా పనిచేస్తాయి. నడవడం మెట్లు ఎక్కడం కూర్చోవడం ఇలా ప్రతి కదలికలో ప్రముఖ పాత్ర ఉంటుంది. వయసు పెరుగుతూ ఉంటే సమస్యలు కూడా పెరుగుతూ ఉంటాయి. మోకాళ్ళ సమస్యలు కూడా పెద్దగా ఉంటాయి. ఇటీవ‌ల ప‌లు ప‌రిశోధ‌న‌ల్లో తేలింది ఏమిటి అంటే చిన్న చిన్న అలవాట్లు మన మోకాళ్ళపై ఎక్కువ ఒత్తిడిని పెంచుతున్నాయట.

మీరు ఎక్కువ సేపు క‌ద‌ల‌కుండా కూర్చోవడం, వ్యాయామం విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకుపోవడం కీళ్లల్లో బిగిత వచ్చేస్తుంది. కండ‌రాలు బలహీనతగా ఉంటాయి. ముఖ్యంగా ఎక్కువ డ్రింక్స్ తాగిన మోకాళ్ళ నొప్పులు వెంటనే వచ్చేస్తాయి. అయితే ఈ సమస్యల గురించి వైద్యులు ఏం చెప్తున్నారు చూద్దాం.

మెట్లు ఎక్కడం మంచి వ్యాయామ‌మే కానీ సరైన బలం లేకుండా పదేపదే ఎక్కువ మెట్లు ఎక్కుతూ దిగుతూ ఉంటే
మోకాళ్ళపై ఒత్తిడి పెరుగుతుంది. వ్యాయామం కూడా చేయడం ఒక పద్ధతి ఉంటుంది ఇష్టం వ‌చ్చిన రీతిన చేయ‌కూడ‌దు.. సరైన వ్యాయామం చేయకపోతే ఉన్నదానికంటే ఎక్కువ సమస్యలు రావచ్చు. వ్యాయామం సమయంలో నొప్పి వచ్చినా దెబ్బ తగిలి పట్టించుకోకపోయినా మోకాళ్ల‌లో నొప్పి ఎక్కువగా వస్తున్న దాన్ని అలా వదలద్దు. సమస్య మరింత పెరగొచ్చు.

సరైన షూ వాడకపోతే మోకాళ్ళ నుంచి అరికాళ్ల వరకు ఎన్నో నొప్పులు వస్తాయి. వ్యాయామం చేసేటప్పుడు జిమ్ చేసేటప్పుడు సరైన షూ అనేది ఎంచుకోవాలి. ఇక శరీరంపై అధిక బరువు పెరిగితే మోకాళ్లపై ఆ భారం పెరుగుతుంది. అందుకే దీర్ఘకాలికంగా మోకాళ్ళ నొప్పి ఆర్థరైటిస్ ఆస్టియో స‌మ‌స్య‌లు ఊబ‌కాయం ఉన్న‌వారికి ఉంటాయి. అందుకే ఈ చిన్న చిన్న పొర‌పాట్లు చేయ‌కుండా ఉంటే మోకాళ్ల నొప్పి స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి.

Leave a Comment