తెలంగాణలో జనసేన ఇప్పుడిప్పుడే బాగా ఎదుగుతున్న పరిస్థితి.. మరోపక్క కవిత తెలంగాణ రక్షణ సేన అనే పార్టీని ఏర్పాటు చేశారు. తెలంగాణ రక్షణ సేనగా ఇప్పుడు ఆ పార్టీ ప్రజల ముందుకు సాగుతోంది. తాజాగా టీఆర్ఎస్ సోషల్ మీడియాలో పెట్టినటువంటి ఒక పోస్ట్ ఇప్పుడు జనసేన వర్గాలు తీవ్రమైనటువంటి వ్యతిరేకత చూపిస్తున్నాయి .. పవన్ కళ్యాణ్ కు సంబంధించిన భూమి, చెరువు పరిధిలో ఉందంటూ తెలంగాణ రక్షణ సేన ఆరోపణలు చేసింది. పవన్ కల్యాణ్ వేల కోట్లు ఎలా సంపాదించారు అంటూ నేరుగా కౌంటర్ ఇచ్చింది.
ట్విట్టర్ వేదికగా తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు రక్షణ సేన నుంచి. చెరువు భూమిని ఆక్రమించి కంచె మీరు వేసినంత మాత్రాన అది మీ సొంత భూమి అవ్వదు అంటూ పవన్ కళ్యాణ్ ని నేరుగా టార్గెట్ చేస్తూ కామెంట్ చేసింది. కవిత ప్రకటించిన ఆస్తులకు మించి గజం భూమి ఉన్నట్టు తేలిన ప్రభుత్వానికి అప్పగిస్తామంటూ స్పష్టంగా చెబుతోంది తెలంగాణ రక్షణ సమితి.
తెలంగాణ జనసేన విభాగం కూడా అదే స్థాయిలో స్పందించింది. కవిత ఆస్తులు ఎక్కడి నుంచి సంపాదించారు మీకు కోట్ల రూపాయల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయి. గతంలో బ్యూటీ పార్లర్ నిర్వహించిన కవితకి ఇప్పుడు ఇలా కోట్ల రూపాయల ఆస్తులు ఎలా వచ్చాయంటూ కౌంటర్లు వేశారు . ఎమ్మెల్సీగా ఉన్న సమయంలో ఈ ఆస్తులు సంపాదించారా ఎంపీగా ఉన్నప్పుడు సంపాదించారా,
తెలంగాణ జాగృతి పేరుతో సంపాదించా ప్రజలకు తెలియచేయాలి అంటూ ఆరోపణలు చేసింది. టిఆర్ఎస్ కాంగ్రెస్ బిజెపితో పోరు చేస్తున్న తెలంగాణ రక్షణ సేన తాజాగా జనసేనని టార్గెట్ చేయడం తెలంగాణ రాజకీయాల్లో ఒక పెద్ద చర్చకు కారణమవుతోంది. అసలు తెలంగాణలో ప్రస్తుతం ఎదుగుదలలో ఉన్న ఈ పార్టీని ఎందుకు టార్గెట్ చేశారు అనే చర్చ తెరమీదకు వస్తోంది.







