ఈసారి ఛాన్స్ వ‌దులుకోను రేవంత్ నాకు దేవుడు – కుమారి ఆంటీ..

హైదరాబాద్ లో కుమారి ఆంటీ త‌న ఫుడ్ బిజినెస్ తో ఎంత పెద్ద సెలబ్రిటీగా మారిందో తెలిసింది. సోషల్ మీడియా ద్వారా కుమారి ఆంటీ క్రేజ్ అంద‌రూ చూశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆమె తెలియ‌ని వారు ఉండ‌రు. అయితే ఇటీవల తనకు వ్యాపారం ఏ విధంగా ఉందో కూడా ఒక ఇంటర్వ్యూలో తెలియచేసింది. అంతేకాదు తన సంపాదన గురించి తన వ్యక్తిగత జీవితం గురించి ఇలా ఆసక్తికర విషయాలు కూడా పంచుకుంది.

మీది మొత్తం 1000 అయింది రెండు లివర్లు ఎక్స్ట్రా అనే మాట సోషల్ మీడియాలో ఎంతలా మారిందో మ‌నం చూశాం. దాదాపు తెలంగాణలో అన్ని జిల్లాల నుంచి ఆంధ్రాలో అన్ని జిల్లాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా కుమారి ఆంటీ వంట టేస్ట్ చేసి వెళ్లేవారు. అంతలా ఆమె హైటెక్ సిటీ ప్రజలకు కూడా బాగా దగ్గరయింది. అక్కడ ఉద్యోగాలు చేసేవారు వ్యాపారస్తులు ప‌నుల‌కి వ‌చ్చేవారు ఆటోవాలా, క్యాబ్ డ్రైవ‌ర్లు, ఇలా ఎంతోమంది ఆమె వంట రుచి చూశారు.

అయితే తన జీవితంలో జ‌రిగిన కొన్ని విషయాలను ఆమె పంచుకుంది. సోషల్ మీడియాలో వైర‌ల్ అవ్వకముందు తన వ్యాపారం బాగా జరిగిందని ఆమె చెప్పింది . ఈ వార్త అందరికి షాక్ ఇచ్చింది. యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆమె మాట్లాడిన మాటలు వైర‌ల్ అవుతున్నాయి. ప్ర‌స్తుతం కస్టమర్లు రావడంలేదని చెప్పింది. రోజుకి 20 వేల వరకు కౌంటర్ వసూలు అయ్యేదని. గ‌తంలో 1500 మంది రోజు వ‌చ్చి ఫుడ్ టేస్ట్ చేసేవారు ఇప్పుడు 1000 మంది వ‌స్తున్నారు అని తెలిపింది.

నిత్యవసర వ‌స్తువ‌లు ధ‌ర‌లు పెరుగుదల వల్ల ఖర్చులు బాగా పెరిగిపోయాయి అంటూ తెలిపింది. గతంలో చికెన్ కిలో 140 ఉంటే ఇప్పుడు 300 దాటిందని, బియ్యం కూడా దాదాపు 1000 రూపాయలు నుంచి 2000 వ‌ర‌కు పెరిగింద‌ని. ఆదాయము ఖర్చులు సమానంగా ఉన్నాయ‌ని చెప్పింది. హైదరాబాద్ రాకముందు
50 రూపాయల కూలీకి వెళ్లానని, 2011లో హైదరాబాద్ వచ్చి హోటల్ పెట్టానని గుర్తుచేసుకుంది. తన హోటల్ తీసేయాలని చెప్పిన సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ కుటుంబాన్ని ఆదుకున్నారని, నాకు దేవుడు అంటే రేవంత్ రెడ్డి అంటూ భావోద్వేగం అయింది. ప్రస్తుతం 7 సినిమాల్లో నటిస్తున్నానని చిన్నచిన్న పాత్రలు చేస్తున్నాన‌ని, బిగ్ బాస్ నుంచి పిలుపు వచ్చినా వెళ్లలేదని ఈసారి అవకాశం వస్తే ఖచ్చితంగా వెళ్తానంటూ కుమారి ఆంటీ స్పష్టం చేసింది.

Leave a Comment