తెలుగు వారికి సినిమాలు అంటే ఎంత ప్రేమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇటీవల కొత్త థియేటర్లు పెరుగుతున్నాయి. మల్టిఫ్లెక్సుల హవా పెరుగుతోంది. తాజాగా ప్రముఖ నిర్మాణ సంస్ధ మైత్రీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇది సినిమా ప్రేక్షకులకి సరికొత్త అనుభూతిని ఇచ్చే నిర్ణయం అని చెప్పాలి.మైత్రీ తమ థియేటర్ల ద్వారా ఇక ప్రేక్షకులకి సర్వపిండి అనుభూతి ఇవ్వనుంది. తెలంగాణ సంస్కృతిని, అచ్చమైన పల్లె రుచులను ఇక పై తమ దియేటర్లలో అందించనుంది మైత్రీ సంస్ద.
తెలంగాణ సంప్రదాయ వంటకమైన సర్వపిండిని అందుబాటులోకి తీసుకురానున్నట్లు అధికారికంగా మైత్రీ సంస్ధ ప్రకటించింది. ఇక ఈ సర్వపిండి అంటే తెలంగాణ ప్రజలకు ఒక ఎమోషన్ అంతేకాదు ఆంధ్రావారికి కూడా ఇది ఎంతో ఇష్టమైన ప్రత్యేక వంటకం. తాజాగా మైత్రీ టేకప్ చేసిన థియేటర్లలో ఈ వంటకం తొలి దశంలో అందించనున్నారు.
మైత్రీ విమల్, మైత్రీ శివగంగ థియేటర్లలో ఈ సౌకర్యాన్ని ప్రారంభిస్తున్నారు. ఇక నాని సినిమా ది ప్యారడైజ్ తో ఈ నిర్ణయం తీసుకున్నార, ఇక సినిమా మధ్యలో విరామంలో దీనిని ప్రేక్షకులు ఆస్వాదించవచ్చు. సినిమా చూస్తు ఈవంటకం టేస్ట్ చేయవచ్చు అని ఈ నిర్ణయం తీసుకున్నారు.
త్వరలో విడుదల కానున్న భారీ చిత్రం ది ప్యారడైజ్ ప్రదర్శన సమయంలో విరామంలో ప్రేక్షకులు ఈ కమ్మని సర్వపిండిని ఆస్వాదించవచ్చు. సినిమా చూస్తూనే, తెలంగాణ ప్రత్యేక వంటకాన్ని రుచి చూసే ఈ కొత్త అనుభవం సినీ ప్రియులను ఆకట్టుకుంటుందని సంస్థ భావిస్తోంది.బామ్మాస్టోరిస్‌కు చెందిన 77 ఏళ్ల బామ్మ కృషి దీని వెనుక ఉంది. ఇక ఈ నిర్ణయం పై తెలంగాణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.







