దసరా వంటి భారీ బ్లాక్ బ్లాస్టర్ తర్వాత హీరో నాని దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో ది ప్యారడైజ్ సినిమా అనౌన్స్ చేశారు. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. మొత్తానికి ఈరోజు ది ప్యారడైజ్ సినిమా గ్రాండ్ గా రిలీజ్ అయింది ప్రపంచ వ్యాప్తంగా. మరి అందాల భామ కయాదు లోహర్ కథానాయికగా నటించింది. అనిరుద్ సంగీత బానిలు సమకూర్చారు. ఈ సినిమా ఏ విధంగా ఆకట్టుకుందో రివ్యూ లో చూద్దాం.
స్టోరీ వైస్ ఒక్కసారి చూస్తే సుమారు రెండువేల కిలోమీటర్లు నడిచి వచ్చి ప్యారడైజ్ దగ్గర 7000 మందితో కూడిన ఒక జాతి ఉంటుంది. వారి పేరు సవారీలు. వీరిలో దేశం కోసం పోరాటం చేసిన కుటుంబాలు ఉంటాయి. అయినా ప్రభుత్వం వారిని రికార్డుల్లో గుర్తించదు. అసలు వాళ్ళు ఎవరికీ గుర్తింపు ఉండదు. వారికి తరాలుగా గుర్తింపు కావాలంటూ పోరాటం చేస్తూ ఉంటారు. చివరికి జనం చచ్చిపోతారు గాని వారికి ప్రభుత్వం గుర్తింపు ఇవ్వదు, ఈ సమయంలో 7 వేల మంది కాస్త ఐదు వేల మందికి తగ్గిపోతారు గుర్తింపు రాదు.
శిఖంజా మాలిక్ కుటుంబమే అక్కడ పరిపాలన చేస్తుంది. అందరిని ముఖ్యంగా సవారీలను చిన్నచూపు చూస్తూ అణగదొక్కుతుంది. వీరికి ఎవరు సహాయం చేయరు. అవసరం అయినా ఎవరు ముందుకు రారు. విద్య వైద్యం ఉపాధి ఏమీ దొరకవు. చివరికి దొంగతనాలు చేస్తూ సారా కాస్తూ జీవితాన్ని నెట్టుకొస్తారు. ఈ సమయంలో సమ్మక్క ఇద్దరు పిల్లలకు జన్మనిస్తుంది. అందులో జడలు నాని ఒక కుమారుడు. సవారిలకు నాయకుడై గుర్తింపు సాధిస్తాడని ఎన్నో కలలు కంటుంది తల్లి. అతనికి మాత్రం అమ్మ అంటే ఇష్టం ఉండదు, ఎందుకు అమ్మని ఇష్టపడడు.
ఎందుకు తల్లికి దూరంగా ఉంటాడు, చివరికి సవారీలకు నాయకుడు అయ్యాడా? తన జాతికి గుర్తింపు తీసుకొచ్చాడా జడలు అనే పేరు అతనికి ఎందుకు పెట్టారు ? ఎందుకు చిన్నవయసులోనే జైలుకు వెళ్లాడు? అసలు తనకు మనసిచ్చినటువంటి సుబ్బు ఎవరు? ఈ విషయాలన్నీ వెండి తెరపై చూడాల్సిందే.
సవారిల నేపథ్యాన్ని పరిచయం చేస్తూ సన్నివేశాలతో సినిమా ఆసక్తికరంగా స్టార్ట్ అవుతుంది. ప్రతి ఫ్రేమ్ కూడా కథలోకి లీనమైయ్యేలా తీసుకెళ్తుంది. తొలి భాగం జైలు ఫైట్ లోనే హీరో చిన్ననాటి నేపథ్యాన్ని చూపించడం చాలా బాగుంది. జడలు పచ్చబొట్టు వెనుక కథను వివరించే సన్నివేశాలు ఫస్టాఫ్ లో చాలా ఆకట్టుకుంటాయి. హీరో హీరోయిన్లు మధ్య ప్రేమ కథ ప్రభావం చూపించాయి.
జడలు పాత్రలో నాని బాగా ఆకట్టుకున్నాడు షేర్ నాని అంటూ తనలోని అసలు సిసలు యాక్షన్ అవతారాన్ని చూపించాడు అనే చెప్పాలి. సో ఓవరాల్ గా మిక్సిడ్ టాక్ సొంతం చేసుకుంది ఈ సినిమా.







