విజ‌య‌న‌గ‌రంలో ఇద్ద‌రు వార‌సురాళ్లు పోటీ ?

విజయనగరం మేయ‌ర్ ఎన్నిక గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. విజయనగరంలో టిడిపి తరఫున మ‌జ్జి శీను కుమార్తె సిరి సహస్ర కచ్చితంగా మేయర్ గా నిల‌బ‌డే అవ‌కాశం ఉంది అని వార్త‌లు వినిపిస్తున్నాయి.
క‌చ్చితంగా ఆమె మేయ‌ర్ రేస్ లో ఉండే అవకాశం ఉందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవ‌లే మ‌జ్జి శ్రీను టీడీపీ లో చేరారు. ఆయన పార్టీ మార్పుతో క‌చ్చితంగా ఆయ‌న మేయ‌ర్ టికెట్ ద‌క్కించుకుంటారు అని చ‌ర్చ జ‌రుగుతోంది.

వైసిపి తరఫున ఇక ఎవరు నిలబడతారనేది ఒక ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. విజయనగరంలోని కోలగట్ల వీరభద్రస్వామి సీనియర్ నాయకుడు. విజ‌య‌న‌గ‌రం మాజీ ఎమ్మెల్యే ఆయన తన కుమార్తె శ్రావణిని కూడా రాజకీయంగా ఇప్పటికే దింపారు. గతంలో డిప్యూటీ మేయ‌ర్ గా పనిచేసిన అనుభవం కూడా శ్రావణికి ఉంది. ఈసారి కచ్చితంగా ఆమె నేరుగా మేయర్ గా వైసీపీ త‌ర‌పున బ‌రిలో ఉండ‌వ‌చ్చు అని టాక్ వినిపిస్తోంది.

శ్రావణి ఇప్పటివరకు అసెంబ్లీ ఎన్నికల్లో లోక్ స‌భ‌ ఎన్నికల్లో పోటీ చేయలేదు. లోకల్ బాడీ ఎలక్షన్స్ లో మాత్రం పోటీ చేసిన అనుభవం కూడా ఉంది. ఈసారి కచ్చితంగా వైసీపీ తరఫున నిలబడే అవకాశం ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో 50 డివిజన్లకు గాను 48 డివిజన్లు 2021లో విజయనగరంలో వైసీపీ గెలుచుకుంది. టిడిపి ఒకటి ఇండిపెండెంట్ ఒకటి గెలిచారు. వెంప‌టాపు విజయలక్ష్మి విజయనగరం కార్పొరేషన్ కి మొదటి మేయర్ అయ్యారు.

సో మొత్తానికి ఈసారి చూసుకున్నట్లయితే ఎవరికి అవకాశం వస్తుందనేది ఒక చర్చ. డిప్యూటీ మేయర్ గా కోలగట్ల శ్రావణి ఆనాడు ఎన్నికయ్యారు. మొత్తానికి 2021 లో వైసీపీ అక్కడ జెండా ఎగరవేసింది. 2026 లో ఎవరు జెండా ఎగురవేస్తారు అనేది మాత్రం లోకల్ బాడీ ఎలక్షన్లో చర్చ జరుగుతోంది. టిడిపి తరఫున సిరి సహస్ర నిలబడితే వైసీపీ తరఫున శ్రావణి నిలబడవచ్చు అంటూ చర్చలు జరుగుతున్నాయి.

Leave a Comment