రాజకీయంగా కొన్ని స్ధానాల్లో కొన్ని పార్టీలకు అక్కడ విజయం దక్కని పరిస్దితి ఉంటుంది. అలాంటి వాటిలో ఏపీలో కొన్ని నియోజకవర్గాలు ఉన్నాయి. ముఖ్యంగా ఏపీలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పటి వరకూ ఒక్కసారి కూడా విజయం దక్కలేని సెగ్మెంట్లు ఉన్నాయి. జగన్ సొంతంగా పార్టీ పెట్టిన తర్వాత చాలా ప్రాంతాల్లో విజయం వచ్చింది. కాని కొన్ని సెగ్మెంట్లో బోణీ కొట్టని స్దితి. మరి అలాంటి సెగ్మెంట్లు ఏమి ఉన్నాయి అనేది చూద్దాం.
వైఎస్సార్‌సీపీ 2011 మార్చి 12న ఏర్పడింది. 2012 ఉపఎన్నికలతో ఎన్నికల ప్రస్థానం ప్రారంభించింది. 2014లో 67, 2019లో 151, 2024లో 11 అసెంబ్లీ స్థానాలు గెలిచింది. అయితే వీటిలో ఒక్కసారి కూడా గెలవని సీట్లు చూస్తే
20 స్థానాలు ఉన్నాయి.
- ఇచ్ఛాపురం
- టెక్కలి
- విశాఖపట్నం తూర్పు
- విశాఖపట్నం పశ్చిమ
- విశాఖపట్నం ఉత్తరం
- విశాఖపట్నం దక్షిణం
- రాజమండ్రి సిటీ
- రాజమండ్రి రూరల్
- పెద్దాపురం
- మండపేట
- ఉండి
- పాలకొల్లు
- గన్నవరం
- రేపల్లె
- గుంటూరు పశ్చిమ
- పర్చూరు
- కొండపి
- చీరాల
- కుప్పం
- హిందూపురం
ఇక వైసీపీ వచ్చేఎన్నికల్లో అయినా కచ్చితంగా ఈ సెగ్మెంట్లపై ఫోకస్ చేస్తుంది అని విశ్లేషకులు తెలియచేస్తున్నారు.







