నానికి ఫ్యాన్స్ స‌ల‌హా అక్క‌డ సినిమా చూడండి..

ప్రతి స్టార్ హీరో తను చేసిన సినిమాని అభిమానులతో కలిసి చూసి ఎంజాయ్ చేయాలని భావిస్తూ ఉంటారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఇటువంటిది కుదరని పరిస్థితి. మాల్స్ , మల్టీప్లెక్స్ లో ఒకే గాని సాధారణంగా థియేట‌ర్ల‌లో చూడ‌లేని ప‌రిస్దితి. ఎందుకంటే అక్కడ పోలీసులు కూడా రద్దీని అభిమానుల ఉత్సాహాన్ని ఆపలేకపోతున్నారు గతంలో పుష్ప సినిమా సమయంలో ఒక దారుణమైనటువంటి ఘటన జరిగింది. అందుకే ప్ర‌భుత్వాలు కూడా ప‌ర్మిష‌న్లు ఇవ్వ‌ని ప‌రిస్దితి.

రెండు తెలుగు రాష్ట్రాల్లో హీరోలు ఈ విధంగా అభిమానుల‌తో కలిసి సినిమా చూడాలంటే ఆలోచ‌న చేస్తున్నారు.
తాజాగా ది ప్యారడైజ్ సినిమా చేశారు నటుడు నాని. ఇక ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఈ సినిమాని అభిమానుల‌తో క‌లిసి చూస్తాను అని నాకు ప‌ర్మిష‌న్ ఇవ్వండ‌ని నాని రిక్వ‌స్ట్ చేశారు.

సీఎం రేవంత్ కూడా దీనిపై క్లారిటీ ఇచ్చారు. తెలంగాణ డిజిపి సీవీ ఆనంద్ కూడా స్పందించారు. హైదరాబాద్ లో గణేష్ నిమజ్జన ఉత్సవాలు ఉన్నాయని ఆర్టీసీ క్రాస్ రోడ్ ప్రాంతం అత్యంత రద్దీగా ఉందని తెలియజేశారు. నిమజ్జన వాహనాలు రాకపోకలు ట్రాఫిక్ రద్దీ విపరీతంగా ఉందని డిజిపి నానికి తెలియజేశారు. ఆర్టీసీ క్రాస్ రోడ్ సమీపంలో కార్యక్రమం పెట్టాలంటే సిటీ పోలీస్ నుంచి అనుమతి తప్పనిస‌ర‌ని చెప్పారు. నగర పోలీసులతో మాట్లాడిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామన్నారు.

సుమారు కొన్నాళ్ల క్రితం ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిస‌లాట‌ ఘటన గురించి సీవీ ఆనంద్ ప్రస్తావించారు. ఒక మహిళ చిన్న కుమారుడు తీవ్రంగా గాయపడ్డారనే విషయాన్ని కూడా తెలియజేశారు. సో ప్ర‌భుత్వం ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటుందో చూడాలి. హీరో నాని దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాని అభిమానుల‌తో కలిసి చూడాలని భావించారు. దీనికి కొంద‌రు చెప్పే స‌ల‌హా ఏమిటి అంటే అక్క‌డే సినిమా చూడాలి అని ఏమి ఉంది. నిమ‌ర్జ‌నాలు లేని ప్రాంతాలు ఎక్కడైనా ఉంటే అక్కడ అభిమానులతో ఈ సినిమా చూసి ఎంజాయ్ చేయచ్చు కదా అని కూడా కొంతమంది సలహాలు ఇస్తున్నారు.

Leave a Comment