గణేష్ చతుర్థి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశ వ్యాప్తంగా వినాయక చతుర్థి ఉత్సవాలు ఎంతో భారీగా జరుగుతున్నాయి. ఇక హైదరాబాద్ లో కూడా ఈరోజు రేపు నిమజ్జనాలు పెద్ద ఎత్తున జరగబోతున్నాయి. ఇక ఖైరతాబాద్ గణేషుడి శోభయాత్ర కూడా సిద్ధం అయిపోయింది. రేపు ఉదయం నుంచి శోభాయాత్ర జరుగుతుంది. ఈరోజు మధ్యాహ్నం నుంచి ఖైరతాబాద్ గణనాథుడి ఊరేగింపు ఏర్పాట్లు చేస్తున్నారు
ఈసారి సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది లడ్డు వేలం పాట. హైదరాబాద్ లో రాజేంద్రనగర్ సర్కిల్లోని కీర్తి గేటెడ్ కమ్యూనిటీలో మంగళవారం రాత్రి గణపతి లడ్డు వేలం జరిగింది. సుమారు కోటి రూపాయల ఒక లక్ష ధర పలికింది. అంటే కోటి రూపాయలు లడ్డు ధర పలకడం నిజంగా అందరిని కూడా ఆశ్చర్యాన్ని గురిచేసింది. శక్తిమాన్ బృంద సభ్యులు ఇక్కడ లడ్డూని కైవసం చేసుకున్నారు.
కీర్తి విల్లాస్ లో లడ్డువేలానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఎందుకంటే అక్కడ కమ్యూనిటీ వాసులు నాలుగు గ్రూపులుగా విడిపోయి ప్రతి ఏటా పోటీపడుతున్నారు. ఈసారి అర్ధరాత్రి వరకు సాగింది వేలం పాట. శక్తిమాన్ బృందం ఇక్కడ విజయాన్ని సాధించింది. ఈసారి కోటి రూపాయలకు ధర పలకడం విశేషం. కోటి రూపాయలు మార్క్ దాటడం నగరంలోని చర్చనీయాంశంగా మారింది. దాదాపు దేశంలోనే ఇంత భారీ ధర పలకడం ఇదే ఈ ఏడాది తొలిసారి అంటున్నారు చాలామంది. ముంబై కంటే హైదరాబాదులోనే లడ్డు ధరలు భారీగా ఉంటున్నాయని ఈ లడ్డు దక్కించుకోవడం వల్ల కుటుంబానికి శుభం ఐశ్వర్యం కలుగుతాయనే నమ్మకం విశ్వాసం కూడా భక్తులకు ఉంది.
హైదరాబాద్ గేటెడ్ కమ్యూనిటీలో లడ్డూ వేలం కోట్లలో జరుగుతోంది. మై హోమ్ భుజాలో కూడా 25 లక్షల రూపాయలకు లడ్డూ వేలం జరిగింది. బాలాపూర్ గణేశుడు లడ్డు వేలం రేపు జరగబోతోంది. ఇక్కడ ఎంత ధర పలుకుతుంది అనేది అందరు కూడా ఎదురుచూస్తున్నారు.







