OTT, శాటిలైట్ ఛానల్స్‌కి బిగ్ షాక్ ఇస్తున్న YOU TUBE..

YOU TUBE అంటే తెలియ‌ని వారు ఎవ‌రు ఉంటారు చెప్పండి. ప్రపంచ వ్యాప్తంగా అంత పెద్ద ఎత్తున యూ ట్యూబ్ త‌న సేవ‌లు అందిస్తోంది. ల‌క్ష‌లాది మందికి ఉపాది క‌ల్పించింది. ల‌క్ష‌ల మంది సొంతంగా ఇన్ ఫ్లూయెన్స‌ర్లుగా మారారు. ఈరోజుల్లో ప్రతి ఒక్క స్మార్ట్‌ ఫోన్‌లో యూట్యూబ్‌ యాప్‌ ఉంటుంది.

వందలో 40 మంది ఈజీగా యూ ట్యూబ్ వినియోగిస్తున్నారు. ఒక విష‌యం చెప్పాలి విదేశాల్లో వేరే వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్ ఉన్నాయి కానీ, ఇండియాలో ఒకే ఒక్క‌టి యూ ట్యూబ్ మాత్ర‌మే. కొత్త‌గా ఏదీ ఎంట్రీ ఇవ్వ‌డానికి కూడా రాని ప‌రిస్దితి అంత పెద్ద ప్రొఫైల్ తో ఉంది YOU TUBE .

అమెజాన్ ప్రైమ్‌ వీడియో, నెట్‌ఫ్లిక్స్‌, హాట్‌స్టార్ , సోనీలివ్, ఆహా ఇవ‌న్నీ ఉన్నా YOU TUBE ఏ మాత్రం త‌గ్గ‌డం లేదు. అయితే వీడియో స్ట్రీమింగ్ లో ఇప్పుడు యూ ట్యూబ్ నుంచి ఒరిజిన‌ల్స్ రానున్నాయి. అంటే వారి ఓన్ కంటెంట్ మార్కెట్లోకి తీసుకువ‌చ్చేందుకు యూ ట్యూబ్ సిద్దం అవుతోంది. ప‌లు సంస్ధ‌ల‌తో ఒప్పందాలు చేసుకుంటోంది.

దీని వ‌ల్ల ఓటీటీ శాటిలైట్స్ కు పెద్ద ఇంపాక్ట్ చూపించ‌నుంది. చాలా మంది యూ ట్యూబ్ వ్యూయ‌ర్లు ఇప్ప‌టికే ప్రీమియం వైపు మ‌ల్లుతున్నారు. స‌బ్ స్క్రీబ్ష‌న్ రేటు కూడా త‌గ్గించి త‌మ‌వైపు తిప్పుకుంటోది యూ ట్యూబ్.

యూట్యూబ్‌ ఇండియా మరింత ముందుకు వెళ్లే ఉద్దేశంతో ఒరిజినల్‌ కంటెంట్‌తో రాబోతోంది. ఇటీవ‌ల ఒక ప్ర‌క‌ట‌న వ‌చ్చింది. ఇక ఒరిజిన‌ల్ కంటెంట్ త‌న వేదిక‌గా ప్రేక్ష‌కుల‌కి అందించ‌నుంది. ఇప్ప‌టికే బాలీవుడ్ సంస్ద‌ల‌తో ఒప్పందాలు చేసుకుంటోంది. అంటే సినిమా నిర్మాణ సంస్ద‌లు ఏమైనా సినిమాలు వెబ్ సిరీస్ లు చేసినా యూ ట్యూబ్ ఒరిజిన‌ల్స్ లో విడుద‌ల చేస్తాయి.

ప్రముఖ నిర్మాణ సంస్థ బాలాజీ టెలీఫిల్మ్స్‌ తో యూట్యూబ్‌ ఇండియా ప్రతినిధులు ఇప్పటికే ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అయితే ఇక్క‌డ కీల‌క విష‌యం ఏమిటి అంటే హిందీ సిరియ‌ల్స్ కూడా ఇక ఒరిజిన‌ల్స్ లో రానున్నాయి. ఎందుకంటే బాలీవుడ్ లో సీరియ‌ల్స్ అంటే బాలాజీ టెలీఫిల్మ్స్ పేరు గుర్తుకు వ‌స్తుంది. ఏక్తాక‌పూర్ ఇలా వ‌రుస‌గా సీరియ‌ల్స్ నిర్మించి యూ ట్యూబ్ ఒరిజిన‌ల్స్ కు ఇవ్వ‌నున్నారు.

ఇక ఒక్కో సీరియ‌ల్ 250 ఎపిసోడ్స్ గా ప్లాన్ చేస్తున్నారు . ప్ర‌జ‌ల నుంచి వ‌చ్చిన రెస్పాన్స్ బ‌ట్టి ఇది మరింత పెంచ‌నున్నార‌ట‌. యూట్యూబ్‌ ఒరిజినల్‌ సీరియల్స్ సక్సెస్ అయితే ప్రముఖ నిర్మాణ సంస్థలు సీరియల్స్ నిర్మాణంకు క్యూ కట్టే అవకాశం ఉంది. సో ఇలా ఒకే అయితే మంచి రెవెన్యూతో సింహ‌భాగంలో ఉన్న శాటిలైట్స్ ఛాన‌ల్స్ కు పెద్ద దెబ్బ త‌గులుతుంది. ఇక త‌ర్వాత యూ ట్యూబ్ ఒరిజిన‌ల్స్ సినిమాలు, వెబ్ సిరీస్ ల‌లోకి రానుంది. చెప్పాలంటే 2028 నుంచి 2030 వినోద రంగం మొత్తం మార‌నుంది

Leave a Comment