భారత ఆటోమొబైల్ మార్కెట్లో ప్రతీ నెలా కార్ల అమ్మకాల్లో రికార్డులు నమోదు అవుతున్నాయి. కొత్త వెహికల్స్ పాత మోడల్స్ ని దాటుతూ సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి..ముఖ్యంగా మన దేశంలో కార్ల అమ్మకాల్లో ఎప్పుడూ స్టార్ ప్లేస్ లో ఉండే మారుతి సుజుకిని వెనక్కి నెట్టి టాటా మొదటిస్ధానంలో నిలిచింది.
ముఖ్యంగా కార్లలో టాప్ సేల్ అంటే టాటా పంచ్, మన దేశంలో ఎక్కువగా అమ్ముడు అయ్యే మోడల్ కారు. ఇక తాజాగా ఆగస్టులో మొత్తం 21,320 యూనిట్ల పంచ్ కార్లు అమ్ముడయ్యాయి. ఇప్పటి వరకూ కార్ల అమ్మకాల్లో ఇది ఒక రికార్డుగా నమోదు అయింది. ఇక రెండో స్దానంలో నిలిచింది మారుతి సుజుకీ వ్యాగనార్ సుమారు 20,180 యూనిట్లు అమ్ముడు అయ్యాయి.
అయితే ఇక్కడ గమనించాల్సింది ఒక్క మోడల్ సేల్ లో టాటా ఆ స్దాయిలో నిలిచింది, ఇక మొత్తం కార్ల అమ్మకాల్లో మారుతి తన స్ధానాన్ని అలాగే నిలబెట్టుకుంది. చెప్పాలంటే ఆగస్ట్ నెల అంతా మొత్తం కార్ల సేల్స్ లో టాప్ 10 లో సుమారు 6 కార్లు మారుతి సుజుకీవి ఉన్నాయి. వ్యాగనార్, స్విఫ్ట్, ఫ్రాంక్స్, ఎర్టిగా, డిజైర్, బాలెనో ఇవన్నీ కూడా టాప్ 10లో చోటు దక్కించుకున్నాయి.
ఇక మూడో స్దానంలో 19,820 తో మారుతి స్విప్ట్ నిలిచింది
ఇక నాలుగో స్ధానంలో మారుతి ఫ్రాంక్స్ 18,730 నిలిచింది
మారుతి ఎర్టిగా 18,516 యూనిట్లతో 5 వప్లేస్ లో నిలిచింది
నెక్సాన్ 18,431 యూనిట్ల అమ్మకాలతో ఆరవ ప్లేస్ లో నిలిచింది
మారుతి డిజైర్ 18,418 యూనిట్లతో ఏడో స్థానంలో ఉంది
క్రెటా 16,288 యూనిట్ల అమ్మకాలతో ఎనిమిదో ప్లేస్ లో ఉంది.
మారుతి బాలెనో 15,746 యూనిట్లతో తొమ్మిదో స్థానాన్ని నిలబెట్టుకుంది.
మహీంద్రా స్కార్పియో 15,576 యూనిట్లతో 10 వప్లేస్ లో నిలిచింది.







