దేశంలో రిచ్చెస్ట్ హీరో షారుఖ్ ఖాన్ఆస్తి ఎంతంటే ?

హురున్‌ ఇండియా రిచ్‌ లిస్ట్ అనేది తాజాగా బయటకు వచ్చింది. ఈ లిస్టులో 2026 లో మన దేశంలోనే అత్యంత ధ‌నికమైన స్టార్ హీరోగా ఒక నటుడి పేరు మరోసారి ఇప్పుడు రికార్డులోకి ఎక్కింది. ఆయ‌న ఎవరో కాదు బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్. మ‌న దేశంలో అత్యంత సంపన్న భారతీయ నటుడిగా చరిత్రలో నిలిచారు. ఆయ‌న సంపద విలువ హురున్‌ వెల్లడించిన ప్రకారం మొత్తం షారుక్ ఆస్తులు విలువ పదివేల కోట్లు.

ఆయ‌న‌కు ప్ర‌ముఖ రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్, నైట్ రైడర్స్ స్పోర్ట్స్ అనేకమైనటువంటి పదుల సంఖ్యలో వ్యాపారాలు ఉన్నాయి. వీటన్నింటి విలువ కలిపి పది వేల కోట్లుగా హురున్ తెలియజేసింది.వీటి ద్వారా వంద‌ల కోట్ల ఆదాయం సంపాదింస్తున్నారు షారుఖ్, అలాగే సినిమాలు ఎండార్స్ మెంట్ల ద్వారా ఆయ‌న ఆదాయం 30 శాతం వ‌స్తోంది.

షారుక్ సంపద గ‌త ఏడాదితో పోలిస్తే బాగా తగ్గింది. 2025లో 12,490 కోట్లుగా ఉంటే ఈ ఏడాది మాత్రం 2490 కోట్లు తగ్గింది. సో హురున్‌ షారుక్ సంపద పదివేల కోట్లుగా తాజాగా ప్రకటించడం జరిగింది. అమితాబ్ కి నాలుగు వేల కోట్ల సంపద ఉంది. ఆయన రెండో స్థానంలో ఉన్నారు. ఇక అమితాబ్ ప్రత్యక్షంగా వ్యాపారాలు చేయకపోయినా ఫ్యామిలీ ఆఫీస్ అలాగే మిగిలిన కంపెనీల్లో పెట్టుబడులు కూడా ఉన్నాయి. అమితాబ్ కి రియల్ ఎస్టేట్ పెట్టుబడుల ద్వారా భారీగా ఆదాయం వస్తుంది.

సల్మాన్ చూస్తే 3000 కోట్ల రూపాయలు ఆస్తి ఉంది. హృతిక్ రోష‌న్ కి 2500 కోట్ల ఆస్తి ఉంది. కర‌న్ జోహార్ ఈసారి చోటు తగ్గించుకోలేదు. ఇక నమిత మల్హోత్రా తండ్రి నరేష్ మల్హోత్రా 16 వేల కోట్ల సంపద‌తో ఈ జాబితాలో ఉన్నారు.

Leave a Comment