నందమూరి నటసింహం బాలయ్య కుమారుడు నందమూరి మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ గురించి ఎప్పటినుంచో నందమూరి అభిమానులు ఎదురుచూస్తున్నారు. అప్డేట్ ఆ గుడ్ న్యూస్ ఇటీవల వచ్చేసింది. ఇలాంటి సమయంలో మరో కిక్ ఇచ్చే వార్త వినిపిస్తోంది.
నందమూరి మోక్షజ్ఞ సినిమాని ప్రముఖ దర్శకుడు వశిష్ట దర్శకత్వం చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా వినిపిస్తున్నటువంటి క్రేజీ అప్డేట్ నందమూరి ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చేలా ఉంది. ఎందుకంటే మోక్షజ్ఞ తండ్రి పాత్రలోనే బాలయ్య ఈ సినిమాలో కనిపించబోతున్నారట. సెకండ్ హాఫ్ లో బాలయ్య పాత్ర పూర్తిగా ఉండబోతుందని తెలుస్తోంది. అయితే మోక్షజ్ఞ వశిష్ట కాంబినేషన్ పై ఒక పెద్ద టాక్ అయితే నడుస్తోంది.గతంలో బింబిసార ఎంత సూపర్ హిట్ అయిందో తెలిసింది. సో విశ్వంభర కూడా చాలా పెద్దగా తెరకెక్కిస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమా గురించి కూడా కలిపి చర్చించుకుంటున్నారు, ఈ సినిమా ఇంకా విడుదల కావాల్సి ఉంది.
వశిష్ట ఈ సినిమా పగ్గాలు చేపడుతున్నారు. సో రొటీన్ మాస్ కథతో కాకుండా కొత్త కాన్సెప్ట్ ఈ సినిమా చేస్తే బాగుంటుందని వశిష్ట కి ఫ్యాన్స్ కూడా తెలియజేస్తున్నారు. సో మొత్తానికి బాలయ్య బాబుకి ఎంతో నచ్చే ఈ సినిమాని లాక్ చేసి ఉంటారని మోక్ష డెబ్యూ మూవీ కాబట్టి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారని నందమూరి అభిమానులు భావిస్తున్నారు. ఈ సినిమా ప్రకటన వచ్చినప్పుడు నుంచి నందమూరి అభిమానులకు ఎంతో కిక్ ఇస్తోంది. మరి ఇద్దరు ఎలాంటి పాత్రలు చేయబోతున్నారు అనే ఆసక్తి అందరిలో కనిపిస్తోంది.







