చిన్న శ్రీను వియ్యంకుడికి జ‌గ‌న్ షాక్..

చిన్న శ్రీను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడిన తర్వాత జిల్లా రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. తెలుగుదేశం పార్టీలోకి చిన్న శ్రీను వ‌ర్గీయులు ఇంకా కొందరు చేరుతారు అంటూ వార్తలు వినిపిస్తున్న వేళ, వైయస్ జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. నెలిమర్లలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్నటువంటి అప్పలనాయుడుని ఇంచార్జ్ పదవి నుంచి సస్పెండ్ చేశారు. అంటే చిన్న శ్రీను కి ఆయన స్వయాన వియ్యంకుడు శ్రీను కుమార్తెని ఆయన కుమారుడు వివాహం చేసుకున్నాడు. అయితే ఇప్పుడు చిన్న శీను కుమార్తె మేయర్ పీఠంపై ఫోకస్ చేశారు.

ఈ సమయంలో కుటుంబంలో ఆమె టిడిపిలో ఉంటూ ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండ‌టం సరైన నిర్ణయం కాదని జగన్మోహన్ రెడ్డి ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. సరికొత్త ఆసక్తికర రాజకీయ పరిణామంగా మారింది. చిన్న శ్రీను పార్టీ మారిన తర్వాత అక్కడ కీలక నాయకుడు ఎవరిని నియమిస్తారని అందరూ చూశారు.

బొత్స‌ సత్యనారాయణ బంధువైనటువంటి మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ కి అక్కడ బాధ్యతలు అప్పగించారు. జగన్ బడ్డుకొండ అప్పలనాయుడు కి షాక్ ఇచ్చారు. ఆయన పార్టీ మారను కచ్చితంగా వైసీపీలోనే కొనసాగుతానంటూ చెప్పినా, ఆయనని ప‌ద‌వి నుంచి తొల‌గించారు. అప్ప‌ల‌నాయుడు 2019లో ఎమ్మెల్యేగా గెలిచారు నెల్లిమర్ల నుంచి . ఇప్పుడు వైసీపీ ప‌ద‌వి నుంచి ఆయ‌న్ని తీశారు అనే ప్రకటన రావడం ఆశ్చర్యాన్ని గుర్తు చేస్తోంది.

ఒక పక్క పార్టీలో ఉంటాను టిడిపికి వెళ్ళనంటూ అప్పలనాయుడు చెప్పిన సరే , వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదవి నుంచి ఆయన్ని ఎందుకు తొలగించారంటూ పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఆయన ప్లేస్ లో గదల సన్యాసినాయుడిని ఇప్పుడు ఇన్చార్జిగా నియ‌మించడం జరిగింది.. నెలిమర్లలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బాధ్యతలని సన్యాసినాయుడు చూస్తారనేది స్పష్టంగా తెలుస్తోంది.

చిన్న శ్రీను వర్గీయులుగా ఉన్నటువంటి మరికొంతమంది టీడీపీలోకి వెళ్ళ బోతున్నారు. వారిపై కూడా వేటు పడబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి.

Leave a Comment