ఆ వార్త‌లు న‌మ్మ‌వ‌ద్దువైజ‌యంతీ మూవీస్ కీల‌క ప్ర‌క‌ట‌న..

సినిమాల్లో నటించాలని కోరిక చాలా మందికి ఉంటుంది. సో ఈ కలల రంగుల‌ ప్రపంచంలో ఒక అవకాశం వస్తే బాగుంటుందని చాలా మంది అనుకుంటారు. అలాంటి వాళ్ళందరూ కూడా సినిమా ఇండస్ట్రీ ఎక్కడ ఉంటే అక్కడికి వస్తూ ఉంటారు. కొంతమంది ఇలాంటి వారిని ఉపయోగించుకొని నకిలీ కాస్టింగ్ కాల్స్ కూడా చేస్తూ ఉంటారు. చివరికి మోసపోయామని తెలిసి బాధ‌ప‌డ‌తారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్దపెద్ద సినిమాలకే కాదు చిన్న సినిమాలకు కూడా ఈ నకిలీ కాస్టింగ్ కాల్స్ బెడ‌ద క‌నిపిస్తోంది. ఇలా ఎన్నోసార్లు పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నా కొంత మంది అమాయ‌కులు మోసపోతున్నారు. సో టాలీవుడ్ ని ఎప్పటినుంచో పైర‌సీ భూతం పట్టిపీడిస్తోంది, అలాగే ఫేక్ కాస్టింగ్ కాల్స్ కూడా చాలా ఇబ్బంది పెడుతూ ఉన్నాయి.

అయితే ఇప్పుడు ఇబ్బంది నేరుగా కల్కి 2 సినిమాకి వచ్చింది. ప్రభాస్ హీరోగా చేస్తున్నటువంటి ప్రతిష్టాత్మక సినిమా ఇది. ఈ సినిమాకి నటినటులు కావాలంటూ కొంతమంది ఫేక్ కాస్టింగ్ కాల్స్ ప్రకటనలు ఇచ్చేశారు. ఇంకేముంది చాలామంది అందులో నటించేందుకు ముందుకు వచ్చారు. అయితే దీని గురించి వైజయంతి మూవీస్ కూడా కీలక ప్రకటన చేసింది. త‌మ‌ కంపెనీ నుంచి ఎటువంటి కాస్టింగ్ నిర్వహించడం లేదని స్పష్టం చేస్తూ ఒక ప్ర‌క‌ట‌న కూడా ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.

తాము ఎక్కడ కూడా ఎటువంటి థర్డ్ పార్టీకి సంస్థకి కంపెనీకి ఇలాంటి అనుమతి ఇవ్వలేదని ఇలాంటి ప్రకటనలు నమ్మవద్దు అని తెలిపింది.. అంతేకాకుండా ఎలాంటి ఏజెన్సీ తో కూడా సంబంధం లేదని కూడా తేల్చి చెప్పింది. కానీ ఎంతమంది ఈ విషయంలో మోసపోయారు అనేది మాత్రం రానున్న రోజుల్లో తేల‌నుంది.
తమ సంస్థ పేరు చెప్పి కొంతమంది మోసాలకు పాల్పడే అవకాశం ఉన్నందున అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని తెలిపింది వైజయంతి మూవీస్.

ఎవరికీ మీ వ్యక్తిగత సమాచారం ఇవ్వకండి, ఆడిషన్ మెటీరియల్ కూడా ఇవ్వద్దంటూ కూడా కంపెనీ తెలియచేసింది. ఇక కొంతమంది డబ్బులు తీసుకుంటూ ఉంటున్నారని అలాంటి వారిని కూడా నమ్మవ‌ద్దు అని తెలియజేసింది. త‌మ‌ సంస్థ పేరు ని అనధికారికంగా ఎవరైనా వాడినా, తప్పుదారి పట్టించేలా ప్ర‌క‌ట‌న‌లు చేసినా కచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటూ కూడా వైజయంతి మూవీస్ హెచ్చరించింది .

Leave a Comment