ఏపీలో రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారుతున్నాయి. ఇటీవల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి మజ్జి శ్రీనివాస్ ఆయన కుమార్తె సిరి సహస్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. అయితే ప్రస్తుతం ఒక ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడిన తర్వాత చాలామంది నాయకులు తెలుగుదేశం పార్టీలోకి కచ్చితంగా వస్తారంటూ ఒక వార్త అయితే వినిపిస్తున్న వేళ , ఆయన సొంత వియ్యంకుడు బడ్డు కొండ అప్పలనాయుడు ఎవరైతే ఉన్నారో ఆయన ఇప్పుడు పార్టీ మారలేదు ఇదే ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చకు కారణమవుతోంది.
సో అంతేకాకుండా సిరి సహస్ర భర్త కూడా ప్రస్తుతం వైసీపీలోనే ఉన్నారనే చర్చ కూడా కొత్తగా తెరమీదకు వస్తోంది. ఆయన సొంత వియ్యంకుడు బడ్డుకొండ అప్పలనాయుడు ఆయన సీనియర్ రాజకీయ నాయకుడు. నెలిమర్ల నుంచి మాజీ ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు. అయితే 2019లో ఆయన గెలుపొందడం జరిగింది జగన్మోహన్ రెడ్డి మూడుసార్లు ఆయనకు టికెట్ ఇవ్వడం జరిగింది.
అందుకే ఆయన వైసీపీని వేడలేదని తెలుస్తోంది. అంతేకాకుండా సొంతంగా ఆయనకంటూ కేడర్ ఉంది ఇప్పుడు చిన్న శీను వెంట నడిచి ఆయన టిడిపిలోకి వెళ్తే, టిడిపిలో ఇప్పటికే అక్కడ సుమారు నలుగురైదుగురు నాయకులు ఉన్నారు. కాబట్టి ఆయనకు వచ్చే ఎన్నికల్లో టికెట్ కూడా రాదు. అదే కారణంతో ఆయన టిడిపిలోకి వెళ్ళలేదనేది ఒక చర్చ అయితే నడుస్తోంది.
సో మొత్తానికి చూసుకున్నట్లయితే మాజీ మంత్రి పతివాడ నారాయణస్వామి కుటుంబం అక్కడ ఉంది. అలాగే బంగ.కుటుంబం కూడా అక్కడ ఉంది. టిడిపి ఇన్చార్జిగా కూడా అక్కడ ఉన్నారు. ఈ సమయంలో చిన్న శ్రీను వెంట కొండ అప్పలనాయుడు టిడిపిలో చేరుతారా లేదా అనే చర్చ అయితే నడుస్తోంది. అంతేకాకుండా సీనియర్లు చాలామంది ఉన్న సమయంలో ఇప్పుడు ఒకవేళ వెళ్తే 2029 ఎన్నికల్లో కచ్చితంగా టికెట్ రాకపోవచ్చు
సిరి సహస్ర ఇప్పుడు పార్టీని వీడి వైసిపి నుంచి టిడిపిలోకి వెళ్లిపోయారు. కానీ ఆమె భర్త మాత్రం అంటే చిన్న శ్రీను అల్లుడు ప్రదీప్ వైసీపీలోనే ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి. సిరి టిడిపిలో ఉంటే భర్త వైసిపి లో ఉన్నారనేది ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా చర్చ జరుగుతోంది.







