జనసేన ఈసారి స్దానిక సంస్ధల ఎన్నికల్లో మెజార్టీ స్ధానాల్లో పోటికి సిద్దం అవుతోంది. అయితే కొన్ని స్దానాలపై ఫోకస్ పెట్టిన జనసేన కచ్చితంగా మేయర్ సెగ్మెంట్లు మున్సిపల్ పీఠాలు కోరుకుంటోంది. మరి ఆ స్దానాలు ఏమిటి అనేది ఓసారి చూస్తే. కార్పొరేషన్లలో తిరుపతి, విశాఖ, విజయవాడ, ఏలూరు కాకినాడ కోరుకుంటోంది. మరి ఇక్కడ అవకాశం ఉందా అంటే పెద్ద చర్చ జరుగుతోంది.
ఎందుకంటే రాజధాని ప్రాంతంగా ఉన్న విజయవాడ పై ఇప్పటికే టీడీపీ తరపున 10 మంది రేసులో ఉన్నారు. మరో పక్క విశాఖ పై కూడా 12 మంది రేసులో ఉన్నారు. ఇక్కడ రెండు స్దానాలు టీడీపీ తీసుకుని జనసేనకు మచిలీపట్నం తిరుపతి ఇవ్వవచ్చు అని టాక్ నడుస్తోంది. మరి పవన్ కల్యాణ్ చంద్రబాబు, మాధవ్ కలిసి సీట్ల పంపకాల్లో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
మొత్తం 17 కార్పోరేషన్లు ఉండగా అందులో ఐదు కచ్చితంగా జనసేన కోరుకుంటోంది. మరో పక్క 17 కార్పొరేషన్లు, 80 మున్సిపాలిటీలు, 26 నగర పంచాయతీలు ఉన్నాయి. వీటిలో దాదాపు 25 నుంచి 30 శాతం జనసేన తీసుకోవచ్చు అంటున్నారు. బీజేపీ కూడా గట్టిగానే స్ధానాలు కోరుతోంది.
ఇక మున్సిపాలిటీలు పరంగా చూస్తే ఎక్కడ ఫోకస్ చేసింది అంటే.
తణుకు, అమలాపురం, నరసాపురం, అనకాపల్లి, మండపేట, నిడదవోలు, పెద్దాపురం, రామచంద్రాపురం, సామర్లకోట, సత్తెనపల్లి, తుని, భీమవరం , పిఠాపురం, తాడేపల్లిగూడెం, తెనాలి, చీరాల, గొల్లప్రోలు, కొవ్వూరు, నగరి, పెడన, పుత్తూరు, తాడిగడప, వుయ్యూరు, యలమంచిలి, జంగారెడ్డిగూడెం మున్సిపల్ మేజర్ పంచాయతీలపై ఫోకస్ చేసింది.. అవకాశం ఇస్తే జనసేన జెండా రెపరెపలాడిస్తాం అని అంటోంది. మరి రానున్న రోజుల్లో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ తమ నాయకులతో ఇప్పటికే చర్చించారు. ఒక కమిటీని కూడా వేశారు. ఆ కమిటీ నివేదిక రావాల్సి ఉంది. నివేదిక వచ్చిన తర్వాత అభిప్రాయాలన్నీ చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ నిర్ణయం తెలియజేస్తారు. చంద్రబాబు నాయుడు కూడా ఫ్రెండ్లీగా ఎటువంటి విభేదాలు లేకుండా పోటీ చేయాలంటూ తెలియజేశారు. సో ఈ సమయంలో కచ్చితంగా జనసేన చాలా ఇంపాక్ట్ చూపించబోతోంది.







