అమ్మాయిలు అబ్బాయిల్లో ఇవే కోరుకుంటున్నార‌ట‌..

ఒకప్పుడు పెళ్లి సంబంధం అంటే అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసేవారు. వాళ్ళు ఏం చదువుకున్నారు అనేది పెద్ద ప‌ట్టించుకునేవారు కాదు. పొలం పనులు వచ్చా వ్యవసాయం బాగా వచ్చా ఇవన్నీ అప్పట్లో చూసేవారు. ఆ తరం పెళ్లిళ్లు అలా జరిగేవి. కానీ తర్వాత తరానికి వచ్చేసరికి ఉద్యోగాలు పారిశ్రామిక విప్లవం ఇవన్నీ కూడా ఎక్కువగా జరగడంతో పరిశ్రమలు పెద్దగా స్థాపించడంతో ఉద్యోగాల ట్రెండ్ పెరిగింది.

పెద్ద పెద్ద ఉద్యోగాలు , ప్రైవేటీకరణ ఇవన్నీ కూడా జరగడంతో ఉద్యోగానికి బాగా వాల్యూ ఇచ్చేవారు. అయితే ఇప్పుడు ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. అంతా యూత్ జన్ జీ త‌రం నడుస్తోంది. ఈ సమయంలో పెళ్లిళ్లకు సంబంధించి అమ్మాయిలు తీసుకునే నిర్ణయాలు బాగా ఆసక్తికరంగా ఉంటున్నాయి.

ఒకప్పుడు పెళ్లి సంబంధం కుదరాలంటే మెయిన్ క్వాలిఫికేషన్ అవే. కానీ ఇప్పుడు మొత్తం ట్రెండ్ రివర్స్ అయిపోయింది. కోట్ల ఆస్తులు వద్దు విదేశాల్లో స్థిరపడడం వద్దు లక్షల జీతం వద్దు అంటూ కొంతమంది అమ్మాయిలు తల్లిదండ్రులు కూడా చెబుతున్నారు.

ఎందుకంటే పెళ్లి సంబంధాలు మార్కెట్ కి సంబంధించిన నిపుణులు కూడా దీనిపై అనేకమైనటువంటి కామెంట్లు కూడా చేస్తున్నారు. ఒకప్పుడు చదువు ఉద్యోగం వస్తే పెళ్లి అయిపోతుందని ధీమా ఉండేది. కానీ ఇప్పుడు పెళ్లి చేసుకోవడం పెద్ద యుద్దంగా మారిపోయింది. కొన్ని కులాల్లో వివాహానికి సంబంధించి అమ్మాయిలు దొరకని పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ టెన్షన్ మరోపక్క ఉద్యోగాల కోసం టెన్షన్ యువతకు సగం జీవితం అయిపోతున్నటువంటి పరిస్థితి .

అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే గతంలో అమ్మాయిలు చదువుల్లో ఉద్యోగాల్లో అబ్బాయిల‌కి సమానంగా ఉండేవారు కాదు. రోజులు మారాయి ఇప్పుడు మాత్రం అమ్మాయిలు అబ్బాయిల వ‌లె చదువుతూ ఉద్యోగాలతో సంపదలో కూడా వారితో సమానంగా ఉంటున్నారు. ఇప్పుడు అబ్బాయి సంపాదన కంటే తమ పక్కన నించున్న సమయంలో చూడడానికి బాగుండాలని పర్ఫెక్ట్ గా ఉండాలని స్టైలిష్ గా ఉండాలని కోరికతో ఎక్కువ మంది అమ్మాయిలు ఉంటున్నారు. సంపాద‌న ఉద్యోగం పెద్ద‌గా ప‌ట్టించుకోవ‌డం లేదు.

అమ్మాయిలు అబ్బాయిల రూపానికి ప్ర‌యారిటీ ఇస్తున్నారు. డబ్బు హోదా కంటే రూపానికి పెద్దపీట్ట వేస్తున్నారు. ఇది ఇప్పుడు కొత్త ట్రెండ్ గా మారిపోయింది. జనరేషన్ మాత్రం దీన్ని ఎక్కువగా కోరుకుంటుందట. సుమారు వందలో 40 శాతం మంది అమ్మాయిలు ఇదే ట్రెండ్ కోరుకుంటున్నారు. గతంలో అయితే డబ్బు ఆస్తి అంతస్తు చూసేవారు ఉద్యోగాన్ని చూసేవారు. ఇప్పుడు మాత్రం అమ్మాయిలు చూడ్డానికి పర్ఫెక్ట్ గా ఉండాలి స్టైలిష్ గా ఉండాలని కోరికను వ్యక్తపరుస్తున్నారట.

Leave a Comment