2027 సంక్రాంతి ఇప్పటికే సినిమాలు గురించి ఒక పెద్ద ఎత్తున చర్చ. 2027 సంక్రాంతి బరిలో మెగాస్టార్ చిరంజీవి ఉంటున్నారు. ఈ విషయం ఇప్పటికే మనకు క్లారిటీ వచ్చేసింది. ఒక్క సినిమా కాదు రెండు సినిమాలు తో నిజమే ఒకవైపు కాకా డేట్ లాక్ చేసుకుని కూర్చుంటే, మరో వైపు విశ్వంభరా కూడా అదే సీజన్ పై కన్నేసింది. ఇది ఇప్పుడు మెగా ఫ్యాన్స్ లో కొత్త ఆలోచన వస్తుంది. సో మొత్తానికి ఏ సినిమా ఇప్పుడు సంక్రాంతికి వస్తుందనేది చర్చ.
విశ్వంభర- కాకా సినిమాలు సంక్రాంతి రేసులో ఉన్నాయని వార్త టాలీవుడ్ లో బాగా వినిపిస్తోంది. జనవరి 13న సంక్రాంతికి కాకా రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటన వచ్చేసింది. ఇప్పుడు ఆ డేట్ కి ముందు డిసెంబర్ లో రంగంలోకి దించాలని ఆలోచన చేస్తున్నారు. జనవరి 9న విశ్వంభర మూవీ రిలీజ్ చేయాలని ఆలోచన ఉన్నట్టుగా తెలుస్తోంది. అంటే 2027 సంక్రాంతి సీజన్ కి రెండు సినిమాలు టార్గెట్ గా వచ్చే పరిస్థితి కనిపిస్తోంది.
నాలుగు రోజుల వ్యవదిలోనే రెండు సినిమాలు రిలీజ్ కి వస్తే పరిస్థితి ఎలా ఉంటుందనేది ఇప్పుడు ఒక చర్చ జరుగుతుంది. పైగా ఒకే హీరోకు చెందిన రెండు భారీ సినిమాలు నాలుగు రోజుల గ్యాప్ అంటే అది సంక్రాంతి సమయంలో అంటే ఇక్కడ సినిమా నిర్మాతలకు అదే విధంగా డిస్ట్రిబ్యూటర్లకు ఎగ్జిబ్యూటర్లకు కూడా ఒక పెద్ద టాస్క్ గానే మాట్లాడాలి.
విశ్వంభర ఎప్పుడో రావాల్సింది ఈ సినిమా కోసం అందరూ ఎంతో ఆత్రంగా ఎదురుచూస్తున్నారు.
వశిష్ట దర్శకత్వంతో సినిమాలో భారీ విజువల్స్ ఉన్నాయి. ఎలిమెంట్స్ ఉన్నాయి. చిరంజీవి యాక్షన్ ఉంది. ఇవన్నీ సినిమాకు కావలసిన కమర్షియల్ హాంగులు.
సో లేట్ అయినా భారీ రేంజ్ లో రావాలని చూస్తున్నఈ సినిమాకి సంక్రాంతి పర్ఫెక్ట్ ఛాయిస్ అనే వార్త వినిపిస్తోంది. వాల్తేరు వీరయ్య తర్వాత చిరంజీవి బాబి కాంబినేషన్ తో వస్తున్న సినిమా కావడంతో క్రేజ్ మరింత భారీగా ఉంది. కాకా సినిమా సంక్రాంతి బరిలో దిగనుంది.
మేకర్స్ స్టేట్ మెంట్ కూడా ఇచ్చేశారు. సో చూడాలి విశ్వంభరా కాక ఈ రెండు సినిమాల పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో. సో ఈ రెండు సినిమాలు సంక్రాంతికి వస్తే ఎలా ఉంటుందని అనుకుంటున్నారో మీ అభిప్రాయం తప్పక కామెంట్లు చెప్పండి







