ట్రైలర్ లేకుండా సినిమా అసలు ఊహించగలమా, నిజమే కష్టం. ఈనెల నాని పారడైస్ సినిమా రిలీజ్ ఉంది. టాలీవుడ్ సినీ చరిత్రలో ట్రైలర్స్ అనేది ఒక ట్రెండ్ దాదాపు ఒక దశాబ్దకాలంగా ట్రెండ్ ఎంతలా నడుస్తుందో మనకు తెలిసింది. పెద్ద సినిమాలు నుంచి చిన్న సినిమాలు వరకు అందరు ఇదే ఫాలో అయ్యారు. కానీ మన ముందుకి సెప్టెంబర్ 24న థియేటర్లకు వస్తున్న సినిమాకు మాత్రం ట్రైలర్ ఉండదని హీరో నాని తేల్చి చెప్పేసారు.
దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కూడా క్లారిటీ ఇచ్చేశారు. నిజంగా ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే పెద్ద వైరల్ అవుతోంది. ట్రైలర్ లేకుండా సినిమా ఎలా రిలీజ్ చేస్తారు అంటూ నాని ఫాన్స్ కూడా కాస్త ఆలోచనలో పడిపోయారు. సో నెక్స్ట్ విడుదల అయ్యే సినిమాలు కూడా ఇదే ట్రెండ్ రూట్ ఫాలో అవుతారని చర్చ నడుస్తోంది. ఎందుకంటే ప్యారడైజ్ సినిమా మీద ఎంత హోప్స్ ఉన్నాయో అందరికీ తెలిసిందే.
సాధారణంగా సినిమాలకు ట్రైలర్ ఇంపార్టెన్స్ చాలా ఉంటుంది. ముఖ్యంగా రిలీజ్ టైమ్ దగ్గర పడేకొద్దీ ట్రైలర్ ద్వారా కొన్ని సినిమాలు, ట్రైలర్ వల్ల సూపర్ హిట్ అయినవి కూడా ఉన్నాయి. ట్రైలర్ వల్లే సినిమాకు వచ్చినటువంటి సినిమా అభిమానులు చాలామంది ఉన్నారు. టికెట్లు కూడా తెగిన సందర్బాలు ఉన్నాయి. ఇప్పుడు మరి అలాంటిది నాని ఎంతో ప్రతిష్టాత్మకంగా చేస్తున్నటువంటి ఈ సినిమాకి సంబంధించి ట్రైలర్ లేకపోవడం ఏమిటి అనేది చర్చ మాత్రం పెద్ద ఎత్తున జరుగుతోంది.
అయితే ఎందుకు ట్రైలర్ కట్ చేయడం లేదు సినిమాకి సంబంధించి చిత్ర యూనిట్ ఎందుకు ఇటువంటి నిర్ణయం తీసుకుందనేది టాలీవుడ్ లో ఒక ప్రత్యేకమైనటువంటి చర్చఅయితే నడుస్తోంది.
మొత్తానికి అనుకున్న టైంలో ఈ సినిమా రిలీజ్ చేయాలని ప్లాన్ లో ఉన్నారు మేకర్స్ కాబట్టి ట్రైలర్ కంటే సినిమా ఎడిటింగ్ వర్క్ లోనే పూర్తి టైం కేటాయిస్తున్నట్లు కూడా తెలుస్తోంది. ప్రమోషన్ కంటెంట్ కూడా ఇప్పటికే సిద్ధం చేశారట మొత్తానికి టాలీవుడ్ చరిత్రలో ఇప్పటివరకు ఉన్నటువంటి సినిమాల్లో ఇది ఒక చరిత్ర క్రియేట్ చేస్తుందని చెప్పాలి.







