మాజీ CM జగన్ జిల్లా టూర్స్ ఎప్పుడు?

మాజీ CM వైయస్ జగన్మోహన్ రెడ్డి 2028లో పాదయాత్ర చేయబోతున్న విషయాన్ని ఇప్పటికే ప్రకటించారు. అయితే దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి రోజున ఈ పాదయాత్ర చేయబోతున్నారని వార్తలు ఇటీవల వినిపించాయి. అఫీషియల్ గా ఇంకా ప్రకటన రావాల్సి ఉంది.

ఈ సమయంలో గతంలో జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి జిల్లాల టూర్ల గురించి ఒక చర్చ నడుస్తోంది.జిల్లాల టూర్లు గత ఏడాది 2025 జనవరిలోనే మొదలవుతాయని అందరూ భావించారు. జగన్ కూడా ప్రజాక్షేత్రంలో ఉండబోతున్నారంటూ వార్తలు వినిపించారు. కానీ ప్రస్తుతం చూసుకున్నట్లయితే జిల్లా టూర్లకు సంబంధించి ఎటువంటి అప్డేట్ రావడం లేదు.

ముఖ్యంగా పాదయాత్ర గురించి అంతా చర్చ జరుగుతోంది. 2027 అంటే ఏడాదిలో పాదయాత్ర ఉండబోతుంది.ఈ సమయంలో జిల్లాల టూర్ల గురించి ఎప్పుడు ఇవి ఉండబోతున్నాయి అనేది చర్చ జరుగుతుంది. తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ స్థానిక సంస్థలు ఎన్నికలు పూర్తయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ముందుగా జిల్లాల టూర్లకు సిద్ధమవుతున్నారు.

జిల్లా టూర్లను పది రోజులకు ఒక జిల్లా చొప్పున టూర్ చేయబోతున్నారు. ఆ జిల్లా టూర్లలో నియోజకవర్గాలన్నీ కవర్ చేస్తారు. అక్కడ ఉన్న నాయకులతో సంప్రదింపులు చేస్తారు.ఆ నియోజకవర్గ సమస్యల గురించి తెలుసుకుంటారు.

అనేక అంశాల గురించి మాట్లాడుతారు. సోషల్ మీడియా టీం తో మాట్లాడుతారు. పార్టీ సెకండరీ ఉన్నటువంటి నాయకులతో మాట్లాడతారు. ఆ తర్వాత నెలకి మూడు జిల్లాల టూర్ పూర్తి చేసి ఆ జిల్లాల ప్రోగ్రెస్ కూడా తెలుసుకుంటారు. ఇలా మొత్తం ఆంధ్రాలో ఉన్నటువంటి జిల్లాల టూర్లన్నీ కూడా పూర్తి చేసి నెల రోజుల తర్వాత పాదయాత్రతో మొత్తం ప్రజాక్షేత్రంలోకి రాబోతున్నారు.

పాదయాత్రకి ఈసారి ప్రజా సంకల్ప యాత్ర 2 అని నామకరణం పెడతారా లేదంటే కొత్త పేరు ఏదైనా ఆలోచిస్తున్నారనేది కూడా ఆసక్తి కనిపిస్తోంది.

సో జగన్మోహన్ రెడ్డి వచ్చే ఏడాది అక్టోబర్ నుంచి పూర్తిగా మరింత ప్రజల్లో ఉండబోతున్నారు. పాదయాత్రతో అంతకు ఆరు నెలల ముందు కూడా జిల్లాల టూర్లతో బిజీ అవ్వబోతున్నారు. లోకల్ బాడీ ఎలక్షన్స్ పూర్తయిన తర్వాత పరిస్థితి బట్టి రాజకీయాలు మరింత మార్పులు రావచ్చు. పార్టీ నుంచి చేరికలు జరగవచ్చు పార్టీ నుంచి బయటికి నాయకులు వెళ్లే అవకాశం కూడా ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు

Leave a Comment