తెలుగు చలనచిత్ర పరిశ్రమలో హీరో దేవరకొండ విజయ్ ఎంత క్రేజ్ సంపాదించుకున్నారో తెలిసిందే. అయితే రానున్న మూడు నెలలు ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఇద్దరు హీరోలకి చాలా కీలకమని చెప్పుకోవాలి. అలాగే రష్మికకు కూడా కీలకం అని చెప్పుకోవాలి. ఎందుకంటే అన్నదమ్ములు ఇద్దరి సినిమాలు, అలాగే విజయ్ భార్య రష్మిక సినిమా కూడా రానుంది. నెలకి ఒక్కోటి చొప్పున థియేటర్లోకి వస్తోంది.
ముందుగా మనం చూసుకుంటే ఈ నెలలో ఆనంద్ దేవరకొండ తన సినిమాతో రాబోతున్నారు
11వ తేదీన ఎపిక్ సినిమాతో మన ముందుకు రాబోతున్నాడు. బేబీ తర్వాత ఒక సాలిడ్ హీట్ అందుకోలేకపోయాడు ఆనంద్. ఈ యంగ్ హీరో మళ్ళీ అదే అంచనాలతో ఈ సినిమాతో వస్తున్నాడు. సో ఎపిక్ సినిమా కోసం ఆయన ఫ్యాన్స్ కూడా అంతలా ఎదురు చూస్తున్నారు. ఇక అక్టోబర్ గురించి చూసుకుంటే స్వయంగా విజయ్ దేవరకొండ తన సినిమాతో ముందుకు వస్తున్నాడు.
రణబలి సినిమా అక్టోబర్ 16న తెలుగు సినిమా ఇండస్ట్రీలో విడుదలవుతోంది. సో కచ్చితంగా ఒక సూపర్ హిట్ కొట్టాలనే ఆలోచనలో ఉన్నాడు విజయ్. అతని క్రేజ్ కి ఈ మధ్యన అతను సినిమాలు బాక్సాఫీస్ లెక్కలకి బ్యాలెన్స్ సరిపోవట్లేదు. సో అందుకే తన ఎంతో కష్టపడి చేసిన రణబాలి సినిమాతో లెక్కలన్నీ కూడా సెట్ చేయాలనుకుంటున్నాడు విజయ్. ఇక మరో సినిమా చూసుకున్నట్లయితే రష్మిక చేసినటు వంటి సినిమా. అది కూడా ధియేటర్లోకి రావడానికి సిద్ధమైపోయింది. సో ఆమెకి మైసా చిత్రం కీలకం. ఎందుకంటే పూర్తిగా రష్మిక క్రేజ్ సినిమా పైన ఆధారపడింది .
నవంబర్ 27న ఈ సినిమా రిలీజ్ అవ్వనుంది. ఇలా చెప్పాలంటే దేవరకొండ ఫ్యామిలీ నుంచి ప్రతినెలా ఒకరు చొప్పున థియేటర్లకు వస్తున్నారు. అందుకే రానున్న మూడు నెలలు కూడా ఈ కుటుంబానికి చాలా కీలకం అవుతున్నాయి.







