చలనచిత్ర పరిశ్రమలో ఎన్నో అవకాశాలు చాలామంది తలుపు తడుతూ ఉంటాయి. కొంతమంది చిన్న స్థాయి హీరోయిన్స్ గా మొదలై స్టార్ హీరోయిన్స్ అయిన వారు కూడా అందులో ఉన్నారు. వారి గురించి మాట్లాడుకోవాలి. 25 ఏళ్ల వయసులోనే ముద్దుగుమ్మ క్రేజీ ఆఫర్స్ సంపాదించుకుంది ఆమె ఎవరో కాదు శ్రీలీల. సినిమా పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఒక పక్క కన్నడ మరోపక్క తమిళ్ మరోపక్క తెలుగు ఇండస్ట్రీలో వరుసగా సినిమాలు చేస్తూ ఉంది శ్రీలీల.
తాజాగా మోక్షజ్ఞకు సంబంధించినటువంటి ఒక మూవీ లాక్ అయిన విషయం తెలిసిందే. బాలయ్య నట వారసుడు వెండితెరకు పరిచయం అవుతున్నాడు. క్రియేటివ్ డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో ఈ సినిమా రాబోతోంది. ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీలీలకు అవకాశం ఉండొచ్చనే వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే బాలయ్య కుటుంబంతో శ్రీలీలకు చాలా మంచి అనుబంధం ఉంది . చేసింది ఒక్క సినిమా అయినా నందమూరి కుటుంబంతో ఆమె బాగా కలిసిపోయింది. తనకు బాలయ్య అంటే ఎంత అభిమానమో పదేపదే చెప్పింది.
ఒక దశలో స్వయంగా బాలయ్య కూడా చెప్పుకువచ్చారు. అప్పుడు కూడా ఎన్నో వార్తలు వినిపించాయి. బాలయ్యకు కూడా శ్రీలీల డాన్స్ ఆమె నటన చాలా ఇష్టం. సో మొత్తానికి ఆమెకు పెళ్లి సంబంధాలు కూడా వెతికి పెడతానని కూడా హామీ ఇచ్చారు. మహేష్ బాబు లాంటి కటౌట్ తో పాటు బన్నీ లాంటి క్వాలిటీ ఉన్న కుర్రాన్ని శ్రీలీల కోసం వెతుకుతానని గతంలో చెప్పారు బాలయ్య. నందమూరి కుటుంబంతో ఉన్న అనుబంధం తో మోక్షజ్ఞ తొలి సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ వచ్చే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. మోక్షజ్ఞ కు 32 సంవత్సరాలు. ప్రస్తుతం మోక్షజ్ఞకు వశిష్ట దర్శకత్వంలో మైత్రి మూవీ చేస్తున్నారు. ఇంకా హీరోని లాక్ చేయలేదు దాదాపు సీరియల్ కూడా తెరమీద వినిపిస్తోంది.







