2024 ఎన్నికల్లో అతి తక్కువ మంది మాత్రమే వైసీపీ తరపున గెలుపొందడం జరిగింది, వారిలో ఎంపీ తనూజా రాణి ఒకరు. ఎంపీగా ఆమె గెలిచి చేస్తున్న అభివృద్ది ప్రజలకు చేస్తున్న సేవ పార్టీలో ఆమెకి మరింత మైలేజ్ తీసుకువస్తుంది. గిరిజన బిడ్డ, డాక్టర్ గుమ్మా తనుజా రాణి రియల్ స్టోరీ ఈ రోజు తెలుసుకుందాం.
అరకు పార్లమెంట్ నియోజకవర్గం నుండి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగి, కేవలం ముప్పై ఏళ్ల ప్రాయంలోనే ఢిల్లీ పీఠాన్ని అధిరోహించిన యువ వైద్యురాలు ఆమె.తనూజ రాణి ఒక విద్యావంతులైన కుటుంబంలో 1993లో జన్మించారు. తండ్రి గుమ్మ శ్యామ్ సుందర్ రావు..ఆమె చెట్టి వినయ్‌ని వివాహం చేసుకున్నారు..ఆమెకు చెట్టి యష్నా అనే కుమార్తె ఉంది. .ఆమె చెట్టి ఫాల్గుణ కోడలు .
ఆమె తండ్రి గుమ్మా సీతారాం ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తూ, సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. తండ్రి ఆశయాలే తనూజను చిన్నతనం నుంచే ప్రభావితం చేశాయి. అలా రాజకీయ ప్రయాణం కొనసాగింది. గిరిజన బిడ్డలు పడుతున్న ఇబ్బందులు అనారోగ్య సమస్యలు చూసి చలించి తాను డాక్టర్ అవ్వాలి అని కోరుకుంది. .పట్టుదలతో చదివి ఎంబీబీఎస్ (MBBS) పూర్తి చేశారు. కేవలం డిగ్రీతోనే ఆగిపోకుండా.. ప్రజారోగ్యంపై మరింత అవగాహన కోసం మాస్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (MPH) కూడా పూర్తిచేశారు.
లక్షల రూపాయలు జీతం ఇస్తాము అని పెద్ద పెద్ద కార్పొరేట్ ఆస్పత్రులు పిలిచినా, మన్యం ప్రాంతంలో మెడికల్ క్యాంపులు నిర్వహిస్తూ, గిరిజన ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తూ వారి గుండెల్లో మన డాక్లరమ్మగా స్థానం సంపాదించుకున్నారు.. ఇలాంటి సమయంలో 2024 ఎన్నికలు ఒక పెద్ద మలుపుగా నిలిచాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. యువతకు, విద్యావంతులకు రాజకీయాల్లో పెద్దపీట వేసే క్రమంలో తనూజ రాణిని అరకు ఎంపీ అభ్యర్థిగా ఎంపిక చేశారు. అప్పటి వరకూ డాక్టర్ గా ఉన్న ఆమె ఒక్కసారిగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.
.
అరకు నుంచి ఎంపీగా ఎన్నికై 30. ఏళ్లకు ఎంపీ అయ్యారు.. ఈ విజయం ఒక మారుమూల గిరిజన ప్రాంత మహిళ సాధించిన అసాధారణ విజయంగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అరకు పార్లమెంట్ పరిధిలో జరిగిన పలు అధికారిక కార్యక్రమాల్లో, అభివృద్ధి పనుల శంకుస్థాపనల్లో ప్రోటోకాల్‌ను పూర్తిగా తుంగలో తొక్కారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఒక నియోజకవర్గానికి ప్రథమ పౌరురాలైన ఎంపీని కాదని, కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించడంపై డాక్టర్ తనూజ రాణి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం శిలాఫలకాలపై ఎంపీ పేరు ఉండాలని, సభా వేదికలపై తగిన గౌరవం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. ఆమె అధికారుల తీరును ఎండగట్టారు. ఒక గిరిజన మహిళ పార్లమెంట్‌కు వెళ్తే ఓర్వలేకపోతున్నారా? అంటూ ఆమె ప్రశ్నించిన విధానం అటు అసెంబ్లీ నుండి ఇటు పార్లమెంట్ వరకు హాట్ టాపిక్‌గా మారింది.







