అక్టోబ‌ర్ నుంచి సినిమాల పండుగ‌ టార్గెట్ 2000 కోట్లు..

ఏడాది చివరి మూడు నెలలు సినిమా ఇండస్ట్రీలో ఒక రేంజ్ లో మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. ముఖ్యంగా సెప్టెంబర్ 24న ప్యారడైజ్ రిలీజ్ అవ్వ‌నుంది. టాలీవుడ్ లోనే అతిపెద్ద రిలీజ్. ఇక సెప్టెంబర్ అక్కడితో ముగుస్తుంది. ఇక మిగిలింది మూడు నెలల స‌మ‌యం. ఈ మూడు నెలల్లో భారీగా సినిమాలు రాబోతున్నాయి. డబ్బింగ్ సినిమాలు కూడా టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతున్నాయి అనే చెప్పాలి. టాలీవుడ్ లో గ‌ట్టి పోటీ క‌నిపిస్తోంది.

చెప్పాలంటే బాక్సాఫీస్ లెక్కలు మార్చే సినిమాలు అనే చెప్పాలి. అక్టోబర్ మొదటివారంలోనే ఆదర్శ కుటుంబం, డోంట్ ట్రబుల్ ది ట్రబుల్, త‌ర్వాత సిగ్మా సినిమాలు విడుద‌ల కానున్నాయి. తర్వాత మరింత పోటీ మధ్యలో పెరుగుతోంది. జైలర్ టు రిలీజ్ అవ్వ‌నుంది. అక్టోబర్ 15 అలాగే 16న విజయ్ దేవరకొండ రణబాలి వస్తుంది. హోమ్ చాప్టర్ కూడా రిలీజ్ కు ఉంది.

సో పెద్ద బిజినెస్ చేసే సినిమాలు అన్ని అక్టోబర్ లోనే కనిపిస్తున్నాయి. నవంబర్ చూస్తే నవంబర్ 6న రామాయణం పార్ట్ వన్ వస్తుంది . ఇంకా సూర్య సీన్ మహాశక్తి ఒకే తేదీకి రానున్నాయి. దుల్క‌ర్ స‌ల్మాన్ ఆకాశంలో ఒక‌తార సినిమా 20 న విడుద‌ల కానుంది. ఇలా తెలుగు తమిళ్ మలయాళం హిందీ మార్కెట్ చాలా భారీగా ఉంది.

తర్వాత చూస్తే ఎండింగ్లో రష్మిక చేసినటువంటి మైసా కూడా వస్తుంది. చెప్పాలంటే నవంబర్ లో కూడా భారీ ప్లాన్ తోనే వస్తున్నాయి సినిమాలు. డిసెంబర్ చూస్తే అక్టోబర్ నవంబర్ కంటే తక్కువగానే ఉన్నాయి. ప్రభాస్ ఫౌజీ డిసెంబర్ 3 కి ప్లాన్ చేశారు. నాగచైతన్య వృషకర్మ నాలుగో తేదిన వ‌స్తోంది. బాలయ్య బాబు దాదా తో పాటు.

నాగార్జున కింగ్ డిసెంబర్ 24 టార్గెట్ పెట్టుకున్నాయి. ఇక షారుక్ కింగ్ కూడా అదే టైంలో ఉంది. తెలుగు రాష్ట్రాల్లో హిందీ సినిమాల నుంచి పోటీ ఉంది. అలాగే తెలుగు సినిమాలు నుంచి కూడా పోటీ గట్టిగానే ఉంది. అక్టోబర్ నవంబర్లో సినిమాలు పండుగనే చెప్పాలి. వాస్త‌వంగా చెప్పాలంటే సంక్రాంతి కంటే ముందే నవంబర్ డిసెంబర్లో సినిమాలు జోరు కనిపిస్తోంది.

Leave a Comment