మెగాస్టార్ చిరంజీవి స్క్రీన్ మీద కనిపిస్తే చాలు. థియేటర్లో పూనకాలు ఫ్యాన్స్ కూడా ఆయన నుంచి సినిమా ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఇక మెగాస్టార్ నుంచి సినిమా అప్డేట్స్ గురించి ఎంత బజ్ కనిపిస్తూ ఉంటుందో మనం చూస్తాం. 70 ఏళ్లు దాటినా ఆయన హవా మాత్రం సినిమాల్లో గ్రేస్ ఎక్కడా తగ్గడం లేదు. ప్రస్తుతం వరుస పెట్టి ప్రాజెక్టులు చేస్తూ బిజీగా ఉన్నారు. ఇప్పటి తరం హీరోలకి కూడా సవాల్ చేస్తున్నారు మెగాస్టార్.
ఆయన స్టెప్స్ కి ఇప్పటికీ కూడా ఫ్యాన్స్ విజిల్ వేయాల్సిందే. ఇంత ఏజ్ లో కూడా కష్టతరమైన స్టెప్స్ వేస్తున్నారు చిరంజీవి.
సినిమా పాత్రలు ఎంచుకోవడం కూడా ఆయన స్టైల్ వేరు. ఇక ఆయన కెరియర్ లో శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమా ఎంత సూపర్ హిట్ అయిందో తెలిసిందే. మళ్లీ అలాంటి సినిమా ఆయన నుంచి చూడాలి అని ఆయన ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. చెప్పాలంటే ఇప్పుడు మెగాస్టార్ చాలా మంది యంగ్ డైరెక్టర్లకు అవకాశం ఇస్తున్నారు. ఇలా ఆయన కోసం ఎవరైనా ఫుల్ లెంగ్త్ కామెడీ ఉన్న శంకర్ దాదా లాంటి సినిమా చేస్తే బాగుంటుంది అని భావిస్తున్నారు. మరి ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియాలో ఈ డిమాండ్ వినిపిస్తున్నారు.
శంకర్ దాదా ఎంబిబిఎస్ సినిమా ఇప్పటికీ ఒక ఎవర్ గ్రీన్ సినిమా. ఎందుకంటే సీరియస్ సిచ్యువేషన్ లో కూడా నవ్వులు పూయించారు. డైలాగ్ డెలివరీలో ఆయన మార్క్ స్పష్టంగా కనిపిస్తుంది. శంకర్ దాదా ఎంబిబిఎస్ గురించి ఇప్పుడు తాజాగా ఒక వార్త అయితే వినిపిస్తోంది. డైరెక్టర్ బుచ్చిబాబు సనా కొత్తగా కధ రాసి ఆయనతో సినిమా చేస్తే బాగుంటుంది అని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. బుచ్చిబాబు ఉప్పెన పెద్ది సినిమాలతో తన టేకింగ్ చూపించారు.
బుచ్చిబాబుకి మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలి అని ఆలోచన ఎప్పటి నుంచో ఉంది. వీరి కాంబో గురించి చర్చ అయితే ప్రతిసారి జరుగుతూనే ఉంటుంది. మెగాస్టార్ కోసం ఒక కథ రాస్తానని పదే పదే బుచ్చిబాబు చెబుతున్నారు. సో అందుకే ఫ్యాన్స్ కూడా వీరి కాంబోలో ఆ సినిమా వస్తే బాగుంటుంది అని ఆలోచన చేస్తున్నారు. మరి చూడాలి రానున్న రోజుల్లో ఈ కాంబో వస్తుందో లేదో.







