తెలంగాణ రాజకీయాల్లో ఒక అంశం పెద్ద ఎత్తున హాట్ టాపిక్ గా మారింది.. ముఖ్యంగా పార్టీ ఫిరాయింపులపై ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఈ చర్చ పెద్ద ఆలోచన రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ తరపున 2023లో ఖైరతాబాద్ నుంచి ఎమ్మెల్యేగా దానం నాగేందర్ గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇక 2024 పార్లమెంట్ ఎన్నికల సమయంలో సికింద్రాబాద్ నుంచి ఎంపీగా కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేశారు. దీనిపై బీఆర్ఎస్ నేతలు కోర్టు వరకూ వెళ్లారు. దీనిపై హైకోర్టు విచారణ చేసింది తాజాగా తీర్పుని ఇచ్చింది. సెప్టెంబర్ 18న దానం నాగేందర్‌ను అనర్హుడిగా ప్రకటించి. ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానాన్ని ఖాళీగా ప్రకటించింది.
దీంతో ఇక్కడ ఉప ఎన్నికలు రానున్నాయి, దీనిపై సుప్రీం కోర్టుని కూడా దానం ఆశ్రయించారు. ఇక ఇక్కడ 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ సీటు దక్కించుకుంది .మళ్లీ ఇప్పుడు కూడా ఈ సీటు దక్కించుకోవాలి అని చూస్తోంది. చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి. ముందు బీఆర్ఎస్ నుంచి పీజేఆర్ తనయుడు విష్ణువర్ధన్ రెడ్డి పేరు బాగా వినిపిస్తోంది. పీజేఆర్ కుటుంబానికి ముందు నుంచి అక్కడ కేడర్ ఉంది . సో దీంతో ఆయనకు అవకాశం ఇస్తే అక్కడ గెలుపు ఈజీ అనే వార్తలు వినిపిస్తున్నాయి.
బీఆర్ఎస్ లో బాగా ప్రముఖంగా వినిపిస్తున్న పేరు దాసోజు శ్రవణ్ పేరు వినిపిస్తుంది. ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉన్నారు. బీసీ వర్గాల మద్దతు కూడా ఆయనకు ఉంటుంది అని టాక్ నడుస్తుంది.మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తనయుడు తలసాని సాయికిరణ్ యాదవ్ పేరు కూడా ఇప్పుడు వినిపిస్తుంది. అయితే తన తండ్రి నుంచి రాజకీయంగా ఎదిగినా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు సాయి కిరణ్.
ఇక 2019 లో సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసిన సాయి కిరణ్ ఇప్పుడు ఉప ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తున్నారట.. మన్నె గోవర్ధన్ రెడ్డి పేరు కూడా మరోసారి వినిపిస్తోంది. ఇక ఆయనకు కూడా ఈసారి అవకాశం రావచ్చు పార్టీ తరపున ముందు నుంచి నిలబడిన వ్యక్తి 2014లో మన్నె గోవర్దన్ రెడ్డి పోటీ చేశారు. అయితే 2018 -2023లో దానంకు టికెట్ ఇస్తే ఆయనకు సపోర్ట్ చేశారు. దీంతో ఆయనకు కూడా రేసులో ఉన్నారు. ఇక దానం మాత్రమే కాదు మిగిలిన నాయకుల విషయంలో కూడా ఇప్పుడు కొత్త టెన్షన్ మొదలైంది. ఇక బీఆర్ఎస్ రేసులో నలుగురు పేర్లు తెరమీదకు వస్తే కాంగ్రెస్ నుంచి ఎవరు వస్తారో చూడాలి.







